మహేష్ కొత్త టీమ్ వచ్చేస్తోంది

0

మారుతున్న ట్రెండ్ కనుగుణంగా మన హీరోల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నటనతో పాటు ఇతరత్రా వ్యాపారాల్లో బిజీ అవుతున్నారు. మన స్టార్ హీరోలు ఈ మధ్య సినిమాల నిర్మాణం పరంగా స్పీడు పెంచి ప్రత్యేక దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించి భారీ చిత్రాలు తీస్తున్నాడు. త్వరలో న్యూ టాలెంట్ తోనూ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అతని బాటలోనే ప్రిన్స్ మహేష్ బాబు కూడా అడుగులు వేస్తున్నాడు.

ఇప్పటికే ఎంబీ ప్రొడక్షన్స్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించి తాను నటించే సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న మహేష్ ఇటీవల మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎంబి (మహేష్ బాబు ప్రొడక్షన్స్) పై ఇక నుంచి కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో మహేష్ వున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్లతో పాటు – కొత్త తరహా చిత్రాల్ని నిర్మించాలనే ఆలోచనలో భాగంగా మహేష్ అందుకోసం కొత్త టీమ్ ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి ఎంబి అఫీషియల్ టీమ్ పేరుతో ఓ టీమ్ ను సిద్ధం చేస్తున్నారట.

ఇటీవల వినూత్నమైన కథాంశాలతో వచ్చిన ఆర్ ఎక్స్ 100 – యూటర్న్ – చిలాసౌ మంచి విజయాల్ని సాధించడమే కాకుండా కొత్త పంథాకు నాంది పలికాయి. దీంతో గీతా ఆర్ట్స్ – యువీ క్రియేషన్స్ – మైత్రీ మూవీమేకర్స్ వంటి పెద్ద సంస్థలు చిన్న చిత్రాల్ని నిర్మించడం మొదలుపెట్టాయి. ఇదే పంథాలో కొత్త వాళ్లని – కొత్త తరహా చిత్రాల్ని ఎంకరేజ్ చేయాలనేది సమ్రత ఆలోచనగా వినిపిస్తోంది. నమ్రత పూనుకుంటే చిన్న బడ్జెట్ చిత్రాల్ని నిర్మించడంలో ఎంబి ప్రొడక్షన్స్ సక్సెస్ నల్లేరు మీద నడకే అవుతుంది. మహేష్ నటిస్తున్న `మహర్షి` శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సమ్మర్కి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Please Read Disclaimer