బన్ని వర్సెస్ మహేష్.. ఈసారి అధికారిక లెక్కలతో!

0

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన `సరిలేరు నీకెవ్వరు`…స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన `అల వైకుంఠరములో` చిత్రాల మధ్య సంక్రాంతి వార్ ఏ రేంజ్ లో నడిచిందో చెప్పాల్సిన పనిలేదు. ఒకరిపై ఒకరు అధిపత్యం కోసం సాగించిన హంగామా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎవరికి వారే రియల్ సంక్రాంతి విన్నర్స్ అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే ఇటీవల ఏ గొడవా లేకుండా చల్లబడ్డారు అనుకుంటే…ఇంతలోనే మరోసారి ఆ ఇద్దరి మధ్య యుద్దం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్.

ఆ వార్ అభిమానుల మధ్య అంతరాన్ని మరింత పెంచేలా కనిపిస్తోందన్న సంకేతాలు అందుతున్నాయి. మరి ఈ వార్ కి రీజన్ ఏమిటి? అంటే ఆసక్తికర సంగతులే బయటకొస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయి ఈనెల 29నాటికి 50 రోజులు పూర్తవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గ్రాండ్ గా 50 రోజుల వేడుక చేయడానికి రెడీ అవుతన్నారు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం సర్వం సిద్ధం చేసి ధూమ్ ధామ్ అనిపించడానికి యూనిట్ మొత్తం రెడీగా ఉంది. ఆ రోజున వసూళ్ల కు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ ప్రేక్షకుల ముందు ఉంచాలని నిర్మాత అనీల్ సుంకర ప్లాన్ చేస్తున్నారుట. ఏరియా వైజ్ లెక్కలు చెప్పి ఇదీ మా హీరో దమ్ము!! అని చెప్పాలని భావిస్తున్నారట.

మరి సరిలేరు టీమ్ అంత వేడిగా ఉన్నప్పుడు అల వైకుంఠపురములో టీమ్ ఊరుకుంటారా? వాళ్లు లెక్కలు బయటకు తీయరూ? ప్రతి పైసా తాము సాధించిన వసూళ్ల లెక్కల్ని వాళ్లు కూడా చెప్పేస్తారు కదా! అన్న చర్చ సాగుతోంది. సరిలేరు రిలీజ్ అయిన మరుసటి రోజు అల వైకుంఠపురములో కూడా రిలీజ్ అయింది. కాబట్టి 30వ తేదిన అల టీమ్ కూడా గ్రాండ్ గా 50 రోజుల వేడుక చేసి ఇండస్ట్రీ హిట్టు అని అనడానికి ఆధారాలు చూపించే అవకాశం ఉంది. అసలే నిర్మాత అల్లు అరవింద్ బాహుబలి రికర్డులను సైతం కొట్టేసిందని వ్యాఖ్యానించారు. కాబట్టి సరిలేరు లెక్కలు తీస్తే గనుక అల లెక్కలు కూడా బయటకు వస్తాయని ఊహిస్తున్నారు. అంటే మళ్లీ యుద్దం కొనసాగుతున్నట్టే దీని ఉద్ధేశం.
Please Read Disclaimer