కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు గా? పదకొండున మళ్లీ పార్టీ

0

సినిమా విడుదల కాక ముందే సక్సెస్ మీద భారీ అంచనాలు పెట్టుకోవటం ఒక ఎత్తు అయితే.. వాటిని సన్నిహితంగా ఉన్న వారి దగ్గర చెప్పుకుంటారే కానీ.. అదే పనిగా పెద్ద పెద్ద వ్యాఖ్యల్ని చేసే ధైర్యం చేయరు. అందుకు భిన్నంగా మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయం మీద వ్యక్తమవుతున్న కాన్ఫిడెన్స్ చూసినోళ్లు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. క్రేజీ కాంబినేషన్ కావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా విడుదలైన టీజర్ తో పాజిటివ్ బజ్ మరింత పెరిగినట్లుగా చెప్పాలి.

అప్పటి వరకూ టీంలో ఉన్న పాటి భయం పోయి.. కాన్ఫిడెన్స్ అంతకంతకూ పెరిగి పోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావటం.. మహేశ్ ను ఆకాశానికి ఎత్తేయటం ఒక ఎత్తు అయితే.. హీరోయిన్ రష్మికను లక్కీ చామ్ గా పోల్చటం ఆసక్తికరంగా మారింది.

ఆదివారం ప్రీరిలీజ్ ఫంక్షన్ చేసకుంటే.. సోమవారం స్పెషల్ పార్టీ చేసి సంబరాల్ని కొనసాగించింది. సినిమాలో కీ రోల్ ప్లే చేసిన వారంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమా సక్సెస్ మీద తొందరపడి వ్యాఖ్యలు చేయటం లాంటివి నమ్రత చేయరు. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఫుల్ జోష్ లో ఉండటమే కాదు.. సినిమా సక్సెస్ కావటం ఖాయమని తేల్చేస్తున్నారు.

బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తూ చరిత్రను క్రియేట్ చేయనున్నారని.. తమ పార్టీలో రత్నవేలు లేక పోవటాన్ని ఆయన మిస్ అయినట్లుగా పేర్కొన్నారు. మరేం ఫర్లేదు సార్.. 11న ఇంతకంటే పెద్ద పార్టీని చేసుకుందామని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి జోష్ వ్యాఖ్యల్ని.. స్టేట్ మెంట్లను నమ్రత మీడియా కు చిక్కేలా ఇవ్వరు. అందుకు భిన్నంగా ఆమె పార్టీ ఫోటోలు బయటకు రావటం చూస్తుంటే.. సినిమా విషయంలో మరింత పాజిటివ్ వేవ్స్ జనరేట్ అయ్యేందుకు వేసిన ఎత్తుగడగా పలువురు అభిర్ణిస్తున్నారు. ఇంత భారీగా ప్రచారం జరుగుతున్న వేళ.. తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Please Read Disclaimer