అతడితో చాలా సెఫ్టీ ఉండేది : నమ్రత

0

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గురించి ఆసక్తిర విషయాలను చెప్పుకొచ్చారు. సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్బంగా ఆయనతో ఉన్న పని అనుభవంను తన ఫాలోవర్స్ తో పంచుకుంది. సంజయ్ దత్ కు బయట చెడ్డ పేరు ఉంది. ఆయన ఆడవారికి బానిస అని.. ఆయన ఉమనైజర్ అంటూ బ్యాడ్ టాక్ ఉంది. అయితే నమ్రత మాత్రం ఆడవారి విషయంలో సంజయ్ దత్ చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించిన నమ్రతకు ది బెస్ట్ కో ఆర్టిస్టు సంజయ్ దత్ అంటా. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. తనతో షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ఆడవారికి పూర్తి సేఫ్టీ మరియు సెక్యూరిటీగా ఉంటాడు. సంజయ్ దత్ ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్లిన సమయంలో యూనిట్ లో ఉన్న ఆడవారందరికి తాను ఒక గార్డ్ గా వ్యవహరించే వాడని అప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకుంది.

సంజయ్ దత్ తనకు ఎంత దగ్గర అంటే మహేష్ బాబుతో ప్రేమ విషయాన్ని మొదట ఆయనతోనే షేర్ చేసుకున్నాను. ఇండస్ట్రీలో ఎంతో మందితో వర్క్ చేసినా కూడా ఆయన చాలా ప్రత్యేకంగా నమ్రత చెప్పుకొచ్చింది. సంజయ్ దత్ వివాదాస్పద జీవితం గురించే తెలిసిన జనాలు నమ్రత మాటలతో ఆశ్చర్య పోతున్నారు.
Please Read Disclaimer