హ్యాండ్సమ్ డాడ్.. క్యూట్ డాటర్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు.. ఫ్యాన్స్ చాలామంది సెలబ్రిటీలను ఫాలో అవుతుంటారు. మహేష్ నుంచి ఈ ఒక్క విషయం నేర్చుకుంటే చాలు.. చాలా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. మహేష్ ప్రతిసారి తన కుటుంబం పట్ల తనకు ఎంత ప్రేమ ఉందో.. ఎంత ప్రాధాన్యతనిస్తారో రుజువుచేస్తూనే ఉంటారు.

మహేష్ ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీపావళి పండుగ రోజు కూడా మహేష్ షూటింగుకు హాజరయ్యారట. ఈ షూటింగ్ లొకేషన్ కు మహేష్ ముద్దుల కూతురు సితార పాప రావడంతో అందరి దృష్టి నాన్న.. కూతుళ్ళపైనే. సితార ఫుల్ ఎనర్జిటిక్.. ఎక్కడ ఉంటే అక్కడ అందరి ఫోకస్ ను తనవైపు తిప్పుకుంటుంది. ఈ సారి కూడా అదే జరిగింది.. మహేష్ ఒడిలో సితార కూర్చుని ఉంటే ఒక ఫోటోను తీశారు. ఆ ఫోటోను మహేష్ సతీమణి నమ్రత పోస్ట్ చేస్తూ “అమ్మాయిలకు నాన్నతో అనుబంధం ప్రత్యేకమైనది. ఈ ఫోటో దీపావళి రోజు షూటింగ్ లోనిది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న సితార పాప నాన్న ఒడిలో కూర్చుని ముద్దులొలికేలా చిరునవ్వుతో ఉంటే మహేష్ ప్రేమగా చూస్తూ ఉన్నారు. యాజ్ యూజువల్ మహేష్ ఈ ఫోటోలో కూడా సూపర్ హ్యాండ్సమ్ గా ఉన్నారు. నెటిజన్లు ఈ ఫోటోను లైక్స్ తో హోరెత్తించారు. “సూపర్ స్టార్ డాడ్.. సూపర్ క్యూట్ డాటర్”.. “లక్కియస్ట్ డాటర్ హ్యాపీ ఫాదర్”.. “సూపర్బ్ టైమింగ్” అంటూ కామెంట్స్ పెట్టారు.
Please Read Disclaimer