టీవీ సీరియల్ లో ప్రదీప్ తో మహేష్ బాబు!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ రేపే విడుదల కానుంది. సినిమా ఎలా ఉంటుందోనని ఇప్పటికే ప్రేక్షకుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ప్రచారకార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి విశేషాలు వెల్లడిస్తూ హైప్ ను మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రచారంలో భాగంగా మహేష్ బాబు పాపులర్ టీవీ సీరియల్ తూర్పు పడమరలో కనిపిస్తారట. జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ నిన్న రాత్రి తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగిందట. ఈ షూట్ లో మహేష్ తో పాటుగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా పాల్గొన్నాడు. మరి సీరియల్ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథి గా హాజరవుతారా లేదా తూర్పు పడమర నటీనటులతో ముచ్చటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా బుల్లితెర వీక్షకులకు ఇదో స్వీట్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు.

ఈ రోజు సాయంత్రం వరకూ మహేష్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా గడుపుతారని.. ఈ రోజు రాత్రికి ‘సరిలేరు టీమ్ కు పార్టీ ఇస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే సినిమా స్పెషల్ షోలకు ప్రీమియర్లకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు కనుక సినిమాకు హిట్ టాక్ వస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సెలబ్రేషన్స్ మరి కొన్నిరోజులు కొనసాగడం గ్యారెంటీ.
Please Read Disclaimer