మహేష్ ని చూసి మా పేరెంట్స్ ప్రేమలో పడిపోయారు: సూపర్ స్టార్ భార్య

0

ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల భార్యలు కెమెరా ముందు కనిపించడం అరుదుగా జరుగుతుంది. అందులోను ఇంటర్వ్యూలంటే ఇంకా అరుదు. మరి ఆ సెలబ్రిటీ భార్య కూడా ఒకప్పటి హీరోయిన్ అయితే.. ఆమె కూడా మెగాస్టార్ లాంటి హీరోతో నటించి ఉంటే.. ఇలా కొన్ని ప్రత్యేకతలను కలిగిన హీరోయిన్ కం సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్. ప్రస్తుతం మహేష్ కి భార్యగా.. ఇద్దరు పిల్లలు గౌతమ్ సితారలకు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక లాక్ డౌన్ సమయంలో ఎవరి ఫోటోలను వారు.. ఎవరి విషయాలు వారే షేర్ చేస్తే.. మహేష్ బాబు విషయాలు మాత్రం ఆయన భార్య నమ్రతనే షేర్ చేసింది. మహేష్ కి తన భార్య అంటే అంత ప్రేమ. పిల్లలంటే ప్రాణం. మరి నమ్రతకి..? వాళ్లు ముగ్గురంటే ప్రాణం. అదెలా అంటారా.. నమ్రత చేతి మీద టాటూ చూడండి.

అలాగే ఆమె మాటలను గమనించండి తెలుస్తుంది. భర్త.. పిల్లలతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే నమ్రత తాజాగా ఫ్యాన్స్ తో ‘అస్క్ మీ యువర్ క్వశ్చన్’ అనే లైవ్ లో పాల్గొన్నారు. ఈ లైవ్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా ఓపికతో సమాధానం ఇచ్చారు నమ్రత. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. మహేష్ సినిమాల్లో నాకు నచ్చేవి.. ఒక్కడు పోకిరి దూకుడు మహర్షి భరత్ అనే నేను సరిలేరు నీకెవ్వరూ అని చెప్పింది. ఇక ఫేవరెట్ హీరో అంటే.. నవ్వుతూనే భర్త మహేష్ పేరు చెప్పేసింది. అలా సరదా ప్రశ్నలలో మీరు ఏది బాగా వండుతారు? అంటే మ్యాగీ నూడిల్స్ అని. లైఫ్ లో మర్చిపోలేని క్షణాలు.. మహేష్ తో పెళ్లి పిల్లలకు జన్మనివ్వడం అని చెప్పింది.

ఇక మహేష్ సినిమాలలో ఎప్పుడైనా ఇన్వల్వ్ అవుతారా? అనే నో అనేసింది. ఇక మహేష్ తో మళ్లీ సినిమా ఎప్పుడు అంటే.. ఏమో చూడాలి అని.. మహేష్ – పూరీల సినిమా కాలం నిర్ణయిస్తుందని వివరించింది నమ్రత. ఇష్టమైన క్రికెటర్లు ధోని కోహ్లీ. ముందుగా ఎవరు ప్రొపోజ్ చేశారు? అనే తెలియదు. పెళ్ళికి మాత్రం మహేష్ ని చూడగానే మా పేరెంట్స్ ప్రేమలో పడ్డారని చెప్పింది. అలా సితార గౌతమ్ అల్లరి చేస్తారని.. ఇంకా టాటూ చూపించి మహేష్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. టాటూలో మహేష్.. గౌతమ్.. సితారల పేర్లు రాసి ఉన్నాయి. దీన్ని బట్టే అర్ధమవుతుంది నమ్రతకి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో.. అంటున్నారు నెటిజన్లు.
Please Read Disclaimer