మహేష్ బాలీవుడ్ ఎంట్రీ షురూ

0

సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? ఈ ప్రశ్నకు ఇన్నాళ్లు సరైన ఆన్సర్ లేనే లేదు. మహేష్ కోసం ఉత్తరాది అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ టైమ్ వచ్చినప్పుడు కచ్చితం గా జరుగుతుందని ఎప్పటి కప్పుడు మహేష్ స్కిప్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇక స్కిప్ కొట్టే వీల్లేదన్నది తాజా సమాచారం. ఎట్టకేల కు ఆ సమయం వచ్చేసింది. మహేష్ బాలీవుడ్ ఎంట్రీ అతి త్వరలో నే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వం లో `సరిలేరు నీకెవ్వరు`తో బిజీగా ఉన్న మహేష్ త్వరలో నే బాలీవుడ్ మూవీ గురించి అధికారికం గా ప్రకటిస్తారట.

సరిలేరు నీకెవ్వరు చిత్రాని కి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి జనవరిలో రిలీజ్ చేస్తున్నారు . ఈ నేపథ్యం లో ఆ రిలీజ్ తర్వాత బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మహేష్ సినిమా చేయనున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యం లో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ కి కథ నే ప్రశాంత్ రెడీ చేశారని తెలుస్తోంది. ఇటీవలే మహేష్ కి ఓ కథ వినిపించాడుట. నచ్చడం తో వెంటనే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2020 మే లో సెట్స్ కు వెళ్లనున్నారని సమాచారం.

మహేష్ నటించే బాలీవుడ్ సినిమా అంటే అది కచ్ఛితంగా పాన్ ఇండియా కంటెంట్ తోనే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. హిందీ- తెలుగు తో పాటు తమిళ్- కన్నడ- మలయాళ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తారట. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ కు బాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యం లోనే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కి అతడు అయితేనే కరెక్ట్ అని భావించి ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి మహేష్ భాగస్వామ్యం లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.
Please Read Disclaimer