మహేష్ బన్నీ మళ్ళీ పోటీ ?

0

సూపర్ స్టార్ మహేష్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ సినిమాలతో వచ్చే సంక్రాంతికి పోటీ పడనున్న సంగతి తెలిసిందే… ఇప్పటికే ఇద్దరు హీరోలు ప్రమోషన్స్ లోనూ పోటీ పడుతూ దూసుకెళ్తున్నారు. ఇటివలే ఒకే రోజు టీజర్ సాంగ్ తో పోటీ పడిన ఈ ఇద్దరూ ఇప్పుడు మరోసారి తమ నెక్స్ట్ ప్రమోషన్ కి ఒకే రోజు ను ఎంచుకున్నారని తెలుస్తుంది.

‘అల వైకుంఠ పురములో’ కి సంబంధించి ఇప్పటికే మూడు పాటలు రిలీజయ్యాయి. ఇప్పుడు టీజర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సరిగ్గా అదే రోజు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

నిజానికి ఒకే రోజు బడా సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తే ఆరోజంతా ఆ సినిమా వార్తలే కనిపిస్తాయి. అలా కాకుండా ఒకే రోజు రెండు సినిమాలు ఇలా ప్రమోషన్స్ తో పోటీ పడితే ఎంతో కొంత రెండు సినిమాలకు ఎఫెక్టే. ఇదంతా పట్టించుకోకుండా ఈ పోటీ ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం ఎందుకో మేకర్స్ కే తెలియాలి.
Please Read Disclaimer