బిగ్ బాస్ 3.. మహేశ్ విట్టా ఎలిమినేటయినట్టేనా?

0

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్-3 నుంచి ఈ వారం మహేశ్ విట్టా అవుటయ్యాడు. 75 రోజులుగా సాగుతున్న ఈ షో… అంతకంతకూ ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతోంది. ఇప్పటికే పలువురు షో నుంచి అవుట్ కాగా… రెండు మూడు పర్యాయాలు ఎలిమినేషన్ కత్తి వేటు నుంచి తప్పించుకున్న మహేశ్ విట్టా… ఈ వారం మాత్రం ఆ వేటు నుంచి తప్పించుకోలేదన్న వార్తలు వైరల్ గా మారాయి. ఆదివారం రాత్రి ప్రసారమయ్యే వీకెండ్ షో సందర్భంగా జరిగే ఎలిమినేషన్ లో రాయలసీమకు చెందిన మహేశ్ విట్టానే ఎలిమినేట్ అవుతాడని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. షో ప్రారంభం నుంచి తనదైన శైలిలో రాణిస్తున్న మహేశ్ విట్టా ఎలిమినేట్ అవుతాడన్న వార్తలు నిజంగానే సంచలనంగా మారాయని చెప్పక తప్పదు.

రాయలసీమ యాసలో కామెడీ పండిస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మహేశ్ విట్టా… బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఎంపికయ్యాడు. తాను చేసిన కామెడీ వీడియోలే అతడికి ఈ అవకాశం దక్కేలా చేశాయని చెప్పక తప్పదు. షో ప్రారంభంలో తనదైన శైలి దూకుడు ప్రదర్శించిన మహేశ్… పలు సందర్భాల్లో తనదైన శైలి ఫైరింగ్ ను చూపి విమర్శల పాలయ్యాడు. అయితే షో జరుగుతున్న కొద్దీ తన వైఖరిలో పూర్తి స్థాయిలో మార్పును కనబరచిన మహేశ్… కంటెస్టెంట్లలో బలమైన వాడిగానే మారిపోయాడు. రెండు మూడు పర్యాయాలు ఎలిమినేషన్ దాకా వచ్చేసిన విట్టా… ఎలాగోలా తనను తాను కాపాడుకున్నాడనే చెప్పాలి. తొలుత బాబా భాస్కర్ తో స్నేహం నెరపిన మహేశ్… ఆ తర్వాత మిగిలిన వారితోనే తనదైన స్ట్రాటజీని మెయింటైన్ చేశాడు.

ఈ వారం ఏకంగా నలుగురు సభ్యులు నామినేషన్ కు ఎంపిక కాగా… వారిలో ఒకడైన మహేశ్ విట్టా ఎలిమినేట్ అవుతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు కూడా నిజమేనన్నట్లుగా విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయినా బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారమయ్యే దాకా ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే ఎందుకో గానీ.. ఈ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం వీకెండ్ షో కంటే ఓ రెండు రోజులు ముందుగానే లీకైపోతోంది. ఆ తరహా లీకుల్లో భాగంగానే ఈ వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అవ్వడం ఖాయమన్న వార్తలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Please Read Disclaimer