మహేష్ ఫ్యాన్స్ ఈ హంగామా ఏమిటి?

0

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనీల్ రావిపూడి దర్శకుడు. అనీల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కి సరిగ్గా 50రోజుల సమయమే ఉంది. అయితే ప్రచారం పరంగా సరిలేరు టీమ్ వెనకబడిందనేది ఫ్యాన్స్ అభిప్రాయం. కాంపిటీటర్ బన్ని సపోర్టింగ్ టీమ్ ఉన్నంత స్పీడ్ గా సరిలేరు టీమ్ లేదని భావిస్తున్నారు. సరైన ప్రోమోలు.. టీజర్లు.. ట్రైలర్లు రిలీజ్ చేయడం లేదేమిటని సామాజిక మాధ్యమాల వేదికగా మహేష్ ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ గా ప్రశ్నిస్తున్నారు.

అయితే ఫ్యాన్స్ ఆవేదనను అర్థం చేసుకున్న దర్శకనిర్మాతలు 22 నవంబర్ సాయంత్రం తొలి టీజర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు గ్రిప్పింగ్ టీజర్ ని రెడీ చేసి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చే ట్రీటివ్వబోతున్నారట. ఇక అల వైకుంఠపురములో టీమ్ తో ఉన్న పోటీ కారణంగా బన్ని ఫ్యాన్స్ కి ధీటుగా మహేష్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ప్రచారంలో తమ ఫేవరెట్ మహేష్ నే స్ఫూర్తిగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు.

మహేష్ ఫ్యాన్ గ్రూప్స్ ప్రత్యేకించి ట్విట్టర్ లో మోత మోగిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన ప్రతి అప్ డేట్ ని వైరల్ గా ప్రమోట్ చేస్తున్నారు. షేర్ లు లైక్ లతో హీటెక్కిస్తున్నారు. మహేష్ సినిమా నుంచి వచ్చే ఏ చిన్న అప్ డేట్ అయినా అస్సలు వదిలిపెట్టడం లేదు. ట్వీట్లు రీట్వీట్లు అంటూ ప్రస్తుతం ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఇవన్నీ గూగుల్ ట్రెండింగులోనూ నిలుస్తున్నాయి. ఇప్పుడింత హంగామా చేస్తున్న ఫ్యాన్స్ సరిలేరు చిత్రానికి ఏ రేంజులో ఓపెనింగ్స్ తేనున్నారో చూడాలి. అసలే సూపర్ స్టార్ వరుస విజయాలతో స్పీడ్ మీదున్నాడు. భరత్ అనే నేను – మహర్షి చిత్రాలు డీసెంట్ హిట్స్ అన్న టాక్ తెచ్చుకోవడంతో ఆ స్పీడ్ ప్రతి సినిమాకి కంటిన్యూ చేస్తున్నారు ఫ్యాన్స్. 2020 సంక్రాంతి విన్నర్ గా తమ ఫేవరెట్ ని నిలబెట్టాలన్న పంతం ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
Please Read Disclaimer