మహేష్ ఫ్యాన్స్ సరిలేరు మీకెవ్వరు

0

ఈమద్య కాలంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తమ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలని ఉత్సాహంగా అభిమానులు ఉంటున్నారు. యూట్యూబ్.. ట్విట్టర్ లలో స్టార్స్ సినిమాలకు సంబంధించిన ట్రెండ్స్ ఈమద్య మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు సినిమా స్టార్స్ సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి.

ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం విషయంలో చాలా ముందు ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విషయమై ట్రెండింగ్ లోనే ఉంటుంది. నేడు సాయంత్రంకు సరిలేరు నీకెవ్వరు నుండి మొదటి పాట మైండ్ బ్లాంక్ రాబోతున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఆ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ మొదలైంది.

జాతీయ స్థాయిలో మన స్టార్ హీరోలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. కాని మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన నాలుగు హ్యాష్ ట్యాగ్ లు వరుసగా టాప్ 4 గా జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఇలాంటి అరుదైన రికార్డు వచ్చి ఉండదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మైండ్ బ్లాంక్.. మహేష్ బాబు సాంగ్.. సరిలేరు నీకెవ్వరు.. మాస్ మహేష్ బాబు మండేస్ ఈ నాలుగు హ్యాష్ ట్యాగ్స్ రాత్రి తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. మీరు చాలా గ్రేట్ టాప్ 4 ఇండియా ట్రెండ్స్ సరిలేరు నీకెవ్వరు అంటూ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశాడు. సరిలేరు మీకెవ్వరు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Please Read Disclaimer