రష్మికకు మహేష్ ఓ సలహా

0

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ బాబు ప్రమోషన్ కార్యక్రమాల్లో తెగ పాల్గొంటున్నాడు. రోజంతా ఇంటర్వ్యూలు మరియు ఇతరత్ర ప్రమోషన్ కార్యక్రమాలు.. చర్చలతో బిజీగా గడిపేస్తున్నాడు. మహేష్ బాబు సినిమా విశేషాలను పంచుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ అనీల్ రావిపూడి మరియు హీరోయిన్ రష్మిక మందన్నలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

దర్శకుడు అనీల్ రావిపూడి సెట్స్ లో చాలా ఫ్రీగా కూల్ గా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పుడైతే దర్శకుడు ఒత్తిడి లేకుండా సెట్స్ లో చాలా కూల్ గా ఉంటాడో అప్పుడు షూటింగ్ చాలా సజావుగా సాగుతుంది. అనీల్ రావిపూడి ఆ విషయంలో చాలా బెటర్ అన్నట్లుగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. అనీల్ షూటింగ్ బ్రేక్ సమయంలో యూనిట్ సభ్యులతో ముచ్చట్లు పెడుతూ డాన్స్ లు వేస్తూ సరదాగా గడుపుతాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక రష్మిక గురించి మహేష్ మాట్లాడుతూ.. ఆమె చాలా ఎనర్జిటిక్ అమ్మాయి. సెట్స్ లో ఉన్న సమయంలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. కాని ఎప్పుడైనా సోషల్ మీడియా లో ఏదైనా బ్యాడ్ కామెంట్స్ చూసినా లేదంటే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియా లో చూసినా కూడా వెంటనే ఆమె మూడ్ ఆఫ్ అవుతుంది. ఆమె సైలెంట్ గా ఒక పక్కన కూర్చుంటుంది. ఎవరితో మాట్లాడేందుకు ఇష్టపడదు.

కొద్ది సమయం వరకు ఆమె అలాగే పక్కకు ఉండి పోతుంది. అందుకే రష్మిక సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం మానేయాలి. ముఖ్యంగా ఫోన్ లో బ్రౌజింగ్ ను తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు. సెట్స్ లో అందరితో యాక్టివ్ గా ఉండవచ్చు అంటూ రష్మికకు మహేష్ సూచన చేశాడు. మంచి సూచన కనుక రష్మిక పాటిస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer