విజయ్ సినిమా మళ్లీ మహేష్ కే దక్కింది

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ఇటీవలే వచ్చిన ‘విజిల్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ప్రాజెక్ట్ గా నిలిచింది. విజిల్ ను తెలుగులో మహేష్ కోనేరు డబ్ చేసి విడుదల చేసిన విషయం తెల్సిందే. విజిల్ చిత్రంతో మహేష్ కోనేరు లాభాలను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాను కూడా మహేష్ కోనేరు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

విజిల్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోట్ చేసి తెలుగు సినిమాలకు ధీటుగా విడుదల చేయడంలో మహేష్ కోనేరు సక్సెస్ అయ్యాడు. అందుకే విజయ్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కూడా మహేష్ కోనేరుకు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆ విషయమై అడ్వాన్స్ లు కూడా తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విజిల్ చిత్రంతో విజయ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అలాగే ఖైదీ చిత్రంతో దర్శకుడు లోకేష్ కు కూడా మంచి పడ్డాయి. అలాంటిది విజయ్ మరియు లోకేష్ ల కాంబో అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రేజీ కాంబో మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 8.5 కోట్లకు మహేష్ కోనేరు దక్కించుకున్నాడు.

పలువురు నిర్మాతలు కూడా ఈ రైట్స్ కోసం ప్రయత్నించినా కూడా విజయ్ మెప్పు పొందిన మహేష్ ఈ రైట్స్ ను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే నెలలో సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశం ఉంది.




Please Read Disclaimer