సర్కారు వారి పాట.. స్టోరీలైన్ అదుర్సే!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్.. మహేష్ లుక్.. టాటూ ఇలా అన్ని అంశాల్లోనూ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఇక ఈ సినిమా కథ బ్యాంకులను ముంచే బడాబాబుల స్కాముల నేపథ్యంలో ఉంటుంది ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా కథ గురించి హీరోయిన్ పాత్ర గురించి మరికొన్ని వివరాలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బ్యాంకు ఉద్యోగి కుమారుడి పాత్రలో నటిస్తారని.. బ్యాంకు స్కాముల కారణంగా తన కుటుంబానికి ఎదురైన ఆర్థిక సమస్యలు.. ఇతర ఇబ్బందులకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బయలుదేరతాడని అంటున్నారు. ఇదో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందట. ఇక హీరోయిన్ విషయానికి వస్తే విలన్ కూతురే హీరోయిన్ అని.. కాసినోలలో జూదమాడడం తనకో హాబీ అంటున్నారు. హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలు కాసినో నేపథ్యంలోనే జరుగుతాయట. లాస్ వేగాస్ లాంటి సిటీలలో కాసినోలు ఫేమస్. ఇక బ్యాంకాక్.. కొలంబో లాంటి చోట్ల కూడా కాసినోల సందడి ఉంటుంది. మన దేశంలో అయితే గోవా కాసినోలకు ఫేమస్. కానీ ప్రస్తుతం అలాంటి చోట్ల షూట్ చేయడం కష్టం కాబట్టి నిర్మాతలు ఒక భారీ కాసినో సెట్ నిర్మించాలనే ప్లాన్లో ఉన్నారట.

ఈ అప్డేట్స్ అన్నీ ‘సర్కారు వారి పాట’ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చెయ్యలేదు కానీ పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారని టాక్ ఉంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer