దేవీ పై మహేష్ ఒత్తిడి దేని కోసం?

0

మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు- అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `మహర్షి` వంటి భారీ విజయం తరువాత మహేష్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఇందు లో తను ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి లో తీవ్రమైన పోటీ నడుమ రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కి పోటీ గా వస్తున్న అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో ప్రచారం పరంగా తీవ్రమైన పోటీ నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన సామజ వరగమన పాటకు చక్కని స్పందన వచ్చింది. దీంతో బన్ని తనకంటే ఓ మెట్టు పైన ఉన్నాడని మహేష్ – అనీల్ రావి పూడి బృందం భావిస్తోందట. దానికి తగ్గట్టే తమ చిత్రం లో స్పెషల్ ఎట్రాక్షన్స్ కావాలని భావిస్తున్నారట. ఒక రకంగా సామజ వరగమన సాంగ్ కి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ని ప్లాన్ చేయమని దేవీ పై ఒత్తిడి పెంచారని టాక్ వినిపిస్తోంది.

అంతే కాదు ఆ పాటకు.. దేవీ శ్రీ తో కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి ఓ స్ట్రాంగ్ కౌంటర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ వుంటేనే ఆడియన్స్ ని పట్టలేం. కానీ సరిలేరు నీకెవ్వరు లో రెండు ప్రత్యేక గీతాల్ని ప్లాన్ చేశారట. ఇప్పటికే ఒక పాటని మిల్కీ బ్యూటీ తమన్నా- మహేష్ లపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట లో తమన్నా తన అందాల తో కేక పుట్టించ బోతోందట. మరో స్పెషల్ హాట్ ఐటమ్ నంబర్ ని ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

పెప్పీ ఐటమ్ నంబర్గా తెర పైకి రాబోతున్న ఈ పాటలో జిగేల్ రాణి పూజా హెగ్డే మెరవనుందని తెలిసింది. మహర్షి` చిత్రం లో మహేష్ తో కలిసి పూజాహెగ్డే నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం లోని స్పెషల్ పెప్పీ నంబర్ కు పూజా అయితేనే బాగుంటుందని భావించిన మేకర్స్ ఆమెకు భారీగా ఆఫర్ చేశారని.. ఆఫర్ నచ్చడం తో పూజా ఈ పాట లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఈ స్పెషల్ నంబర్ల ప్లాన్ పూర్తిగా కాంపిటీటర్ కి కౌంటర్ అనే అభిమానులు భావిస్తున్నారు. ఒత్తిడి కి తగ్గట్టే దేవీ శ్రీ అదిరి పోయే ట్యూన్లను రెడీ చేస్తున్నారట. ఇందు లో మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. కొంత విరామం తరువాత లేడీ అమితాబ్ విజయ శాంతి రీఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇందులో విజయ శాంతి ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతోంది.
Please Read Disclaimer