‘ఒక్కడు’ గుర్తొస్తుంది మహేష్

0

ఇటివలే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీజర్ మిలియన్స్ వ్యూస్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇక అంత బాగానే ఉంది. కానీ ఈ టీజర్ చూసాక చాలా మంది ప్రేక్షకులకు కలిగిన సందేహం ఒకటుంది. అదే ఒక్కడు సినిమా. అవును సరిలేరు టీజర్ చూస్తూ అందరూ మహేష్ ‘ఒక్కడు’ ను గుర్తుచేసుకున్నారు.

టీజర్ లో చూపించిన మహేష్ యాక్షన్ ఎపిసోడ్ కొండారెడ్డి బురుజు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇలా అన్ని ఎలెమెంట్స్ ‘ఒక్కడు’తో పోలి ఉన్నాయి. నిజానికి మహేష్ కెరీర్ లో ఒక్కడు ఓ క్లాసిక్. పోకిరి కంటే ముందే మహేష్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర తెలియజేసిన సినిమా. ఆ సినిమాను గుణ శేఖర్ బాగా హ్యాండిల్ చేసి సంక్రాంతికి ఓ అదిరిపోయే సినిమా అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేసింది.

ఇక సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఆర్మీ మెన్ గా నటిస్తున్నాడు. ఆ ఒక్క ఎలిమెంట్ తప్ప టీజర్ అంతా ఒక్కడు నే గుర్తుచేసింది. మరి ట్రైలర్ లో అయినా కొత్తదనం ఉంటుందేమో చూడాలి.
Please Read Disclaimer