మహేష్ కి సంక్రాంతి భయం ?

0

టాలీవుడ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్. పైకి ఏమి లేదంటూనే కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ కి భయ పడుతుంటారు స్టార్స్. ఇప్పుడు మహేష్ అదే భయం తో ఉన్నాడు. కొని బ్యాడ్ సెంటిమెంట్స్ ను మహేష్ చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అప్పుడెప్పుడో ఓపెనింగ్ కి ఎటెండ్ అయిన సినిమా ఫ్లాప్ అయితే అప్పటి నుండి ఓపెనింగ్స్ రాకుండానే కానిచ్చేస్తున్నాడు.

సో ఇప్పుడు మహేష్ కొత్త భయం పట్టుకుంది. అదే సంక్రాంతి సెంటిమెంట్. మహేష్ నటించిన ఓ ఐదారు సినిమాలు సంక్రాంతి కి రిలీజయ్యాయి. అందులో ‘ఒక్కడు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’బిజినెస్ మెన్’ సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్స్ అయితే ‘టక్కరి దొంగ’ 1 నేనొక్కడినే’ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక 1 నేనొక్కడినే తర్వాత మళ్ళీ సంక్రాంతి కి సినిమా వేసే సాహసం చేయలేదు సూపర్ స్టార్.

ఎట్ట కేలకు మళ్లీ ఇన్నేళ్ళకి ‘సరిలేరు నీకెవ్వరు’ తో సంక్రాంతి పోటీలో నిలిచాడు. పైకి సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నా లోపల మాత్రం ‘1 నేనొక్కడినే’ బ్యాడ్ సెంటిమెంట్ మహేష్ మనసులో భయం పుట్టిస్తోందట. మరి సరిలేరు సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అయితే ఇక మహేష్ మళ్లీ ఈ సక్సెస్ ఫుల్ సెంటిమెంట్ ని మైండ్ పెట్టేసుకొని మరో సంక్రాంతి కి ఇంకో సినిమా తో వచ్చే ఛాన్స్ ఉంది.
Please Read Disclaimer