వోగ్ ను షేక్ చేస్తున్న మహేష్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్క హిందీ సినిమా చేయకపోయినా కూడా బాలీవుడ్ లో మహేష్ పేరు తెలియని వారు లేరంటే అదేమీ ఆశ్చర్యం కాదు. తాజాగా మహేష్ ప్రఖ్యాత వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిచ్చాడు.

నిజానికి వోగ్ మ్యాగజైన్ వారు మహేష్ వెనక్కు తిరిగి ఉన్న ఫోటోను కవర్ పేజిపై ప్రచురించి ఈ స్టార్ ఎవరో కనుక్కోండి అని ప్రశించారు. అయినా వోగ్ పిచ్చికానీ.. వెనక్కు తిరిగినా పక్కకు తిరిగినా.. ఎలాంటి పొజిషన్లో ఉన్నా మహేష్ ను తెలుగు ప్రేక్షకులు చిటికెలో కనుక్కుంటారు. అదే వీరాభిమానులైతే అసలు చూడకుండా కళ్ళు మూసుకునే కనిపెడతారు. ఎందుకంటే ఆ సూపర్ స్టార్ ఫ్రీక్వెన్సీ .. వైబ్రేషన్స్ అలాంటివి మరి. ఇంతకీ వోగ్ వారు ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే “ఆయన నాలుగేళ్ళ వయసులో సినిమాలో నటించడం ప్రారంభించారు.. అప్పటి నుంచి ఆయనకు అడ్డే లేదు. 20 అవార్డులు గెలుచుకున్నారు. అందుకే ఆయనను #సూపర్ స్టార్ అంటారు. అక్టోబర్ 2019 కవర్ స్టార్ ఎవరో మీరు కనుక్కోగాలరా?”

ఎప్పటిలాగే మహేష్ ఈ కవర్ పేజ్ పై డాషింగ్ లుక్ లో ఉన్నారు. వెనక్కు తిరిగి నిలుచున్నా ఆ స్టైల్ కు పోటీనే లేదు. వైట్ కలర్ టీ షర్టు.. పైనేమో బ్లాక్ కలర్ జాకెట్… బ్లాక్ ప్యాంట్ ధరించి సూపర్ పోజిచ్చారు. ఎంతోమంది కవర్ పేజిపై కనిపించి ఉంటారు కానీ ఇది మాత్రం సెన్సేషనల్ పోజు అనే చెప్పాలి. ఈ పోస్ట్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.. “మహేష్ బాబు”.. “SSMB”.. “జై మహేష్ అన్న”.. “మహేష్ అన్న కాకపోతే ఇంకెవరు” అంటూ తమ స్పందన తెలిపారు.
Please Read Disclaimer