మహేష్ వారసుడు గ్రేట్ అఛీవ్ మెంట్

0

పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! … సుమతీ శతకకారుడు చెప్పిన ఆ పద్యం.. ఈ సందర్భానికి సరితూగేదే. సూపర్ స్టార్ మహేష్ – నమ్రత జంట వారసుడు గౌతమ్ ని ఈ ఫోటోలో చూస్తుంటే ఆ సెలబ్రేషన్ మూవ్ మెంట్ ఎలాంటిదో అర్థమవుతోంది కదూ?

చేతిలో అవార్డ్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇంతకీ ఇదేం అవార్డ్ అంటే.. నమ్రత శిరోద్కర్ స్వయంగా వివరాలందించారు. మోడల్ యునైటెడ్ నేషన్స్ (MUN) కి సంబంధించిన బెస్ట్ డెలిగేట్ అవార్డ్ ని తన సొంతం చేసుకున్నాడు. తన స్నేహితుడు యశష్ కి హై కమండరేషన్ పురస్కారం దక్కింది. `కంగ్రాట్యులేషన్స్ మై సన్!! ఫర్ విన్నింగ్ అవార్డ్“ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తన స్నేహితుడు యశ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

వారసులు గౌతమ్ – సితార వేగంగానే ఎదిగేస్తున్నారు. స్కూల్ స్టడీస్ సహా రకరకాల ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ లోనూ పేరు తెచ్చుకుంటున్నారు. ఇక సితార అయితే సోషల్ మీడియా.. యూట్యూబ్ చానెల్ అంటూ బోలెడంత సందడి చేస్తోంది. గౌతమ్ – సితార ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. గౌతమ్ తాజా అఛీవ్ మెంట్ కి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. అందుకే నిజంగానే నమ్రతకు మహేష్ కి ఇది గ్రేట్ మూవ్ మెంట్ అనే చెప్పాలి.
Please Read Disclaimer