మహేష్ సూర్య యాడ్.. హాట్ టాపిక్!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో నటించడంతో పాటుగా పలు కార్పోరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తాడనే సంగతి తెలిసిందే. తెలుగు స్టార్లలో మహేష్ బాబే అత్యధిక సంఖ్యలో బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తుంటారు. ఆయన ఖాతాలో సూర్య డెవలపర్స్ బ్రాండ్ కూడా ఉంది. నిన్న సూర్య డెవలపర్స్ యాడ్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా మహేష్ పోస్ట్ చేశారు.

ఈ యాడ్ లో ప్రత్యేకత ఏంటంటే మహేష్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండడం. సతీమణి నమ్రత.. పిల్లలు గౌతమ్.. సితార కూడా ఈ యాడ్లో ఉన్నారు. ఇది సూపర్ స్టార్ ఫ్యామిలీ యాడ్. ఎప్పటిలాగే మహేష్ హ్యాండ్సమ్ గా ఉన్నారు.. నమ్రత ఎంతో గ్రేస్ ఫుల్ గా.. పిల్లలు ఎంతో అందంగా ఉన్నారు. ఫ్యాన్సుకు.. చాలామంది నెటిజన్లకు ఈ యాడ్ తెగ నచ్చింది. పొగడ్తలతో ముంచెత్తారు. కొందరైతే అందరూ కలిసి ఒక కుటుంబ చిత్రం చేయాలని కోరారు. అయితే ఈ యాడ్ కు విమర్శలు కూడా తప్పలేదు. యాడ్ లో మహేష్ కనిపిస్తే సరే కానీ పిల్లలతో చేయించడం పై కొందరు విమర్శలు ఎక్కుపెట్టారు. కొందరేమో దీపావళి పండగ త్వరలో ఉంది కాబట్టి టీజర్ ప్రకటన పోస్టర్ లేదా మరో పోస్టర్ వస్తుందని ఆశిస్తే యాడ్ వచ్చిందని.. ఈ యాడ్స్ గోల మాకెందుకు అంటూ రుసరుసలాడారు.

యాడ్స్ సంగతి పక్కన పెడితే మహేష్ ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer