కరోనా వల్ల సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ విషయం మర్చిపోయారా..?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి రిలీజైన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా వచ్చి రెండు నెలలు దాటింది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా టీవీలో కూడా టెలికాస్ట్ చేసారు…కానీ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ సినిమా త్వరగా ప్రకటించమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ సూపర్ స్టార్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంతక ముందు మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తో చేస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది పుకారుగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాకి గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం చేయబోతున్నట్లు మరో వార్త వచ్చింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇలాంటి నేపథ్యంలో కరోనా వచ్చి కలవరం సృష్టించింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ప్రముఖుల నుండి సామాన్యుల వరకు కరోనా భయం పట్టిపీడిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. జనతా కర్ఫ్యూ కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రేమికులు స్టార్ హీరో ఫ్యాన్స్ సైతం అటు వైపు దృష్టి మళ్లించడం లేదు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ మొన్నటి వరకు ఆయన కొత్త మూవీ అప్డేట్ కొరకు ఎదురు చూశారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరో త్వరగా సినిమా ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల ఆయన ఫ్యాన్స్ కొత్త మూవీ ప్రకటన గురించి మర్చిపోయారు. ఇక మహేష్ ఇప్పటికే తన కొత్త చిత్రాన్ని నిర్ణయించుకొని ఉన్నా వెంటనే ప్రారంభించే పరిస్థితి లేని పక్షంలో అప్పుడే ప్రకటించకూడదు అనే భావనలో ఉండి ఉండవచ్చు. ఏదేమైనా కరోనా ప్రభావం మహేష్ పై ఒత్తిడి తగ్గించిందని చెప్పవచ్చు. తాజాగా కరోనా బాధితుల సహాయార్థం కోటి రూపాయలను ఇరు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించడం తన అభిమానుల్లో సంతోషాన్ని కలిగించింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-