మహేష్ లాంగ్ బ్రేక్ తీసుకోనున్నాడట

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విషయం తెల్సిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ నెలాఖరు వరకు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో అయినా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ మరో హిట్ కొట్టడం ఖాయం అంటూ ఆయన ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

మహర్షి చిత్రం విడుదలైన వెంటనే ఎలాంటి గ్యాప్ లేకుండా వెంటనే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంను ప్రారంభించాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు 27వ చిత్రం గురించిన చర్చ కూడా జోరుగా సాగుతోంది. మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లికి మరోఛాన్స్ను మహేష్ ఇచ్చాడని.. వీరిద్దరి కాంబోలో మరో మూవీ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వంశీ చెప్పిన స్టోరీకి మహేష్ ఓకే చెప్పడం.. ప్రస్తుతం వంశీ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

మహేష్ 27వ సినిమా కన్ఫర్మ్ అయ్యింది కనుక సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు విడుదల అయిన వెంటనే అది ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కాని మహేష్ బాబు మూడు నెలల విశ్రాంతి తీసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని నమ్రత చెప్పినట్లుగా ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా మహేష్ బాబు బిజీగా గడుపుతున్నారు. అందుకే ఆయన మూడు నెలల విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లుగా ఆమె చెప్పిందట.

ఈ మూడు నెలలు పిల్లలతో పూర్తి టైంను స్పెండ్ చేయడంతో పాటు తర్వాత సినిమా కోసం రెడీ అవుతాడని నమ్రత చెప్పిందట. అంటే మహేష్ బాబు 27వ చిత్రం సమ్మర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వంశీ స్క్రిప్ట్ వర్క్ కు చాలా సమయం తీసుకుంటాడని అంటూ ఉంటారు. ఆయన గత చిత్రాలకు కూడా స్క్రిప్ట్ వర్క్ నెలలు నెలలు చేశాడని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు కూడా వంశీ కనీసం ఆరు నెలల టైం ను స్క్రిప్ట్ వర్క్ కు కేటాయిస్తాడని టాక్ వినిపిస్తుంది. వంశీ పూర్తి స్క్రిప్ట్ తయారు చేసే వరకు మహేష్ బాబు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటాడు కావచ్చు.
Please Read Disclaimer