రిలీజ్ కు ముందే సూపర్ స్టార్ పార్టీ

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినిమాపై కూడా భారీగా హైప్ ఉంది. పండగ సీజన్ కావడంతో ఓపెనింగ్ రికార్డులు ఖాయమని కూడా అంచనాలు ఉన్నాయి. మహేష్ కూడా ఈ సినిమా విజయం పై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఈమధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకులను అలరించడం ఖాయమని.. ఇది పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫిలిం అని చెప్పుకొచ్చారు.

జస్ట్ ఇంటర్వ్యూలలో చెప్పడమే కాదు.. ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందనేది మహేష్ మరో రకంగా క్లారిటీ ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కు హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో సూపర్ పార్టీ ఇస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటులు.. టెక్నిషియన్లు పార్టీకి హాజరవుతారట. సాయంత్రానికి దాదాపుగా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ పూర్తవుతాయి కాబట్టి సరిలేరు టీమ్ ఈరోజు వేడుకల్లో మునిగి పోతారన్నమాట. సినిమా రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే పార్టీ ఇవ్వడం చాలా సాధారణం. అయితే మహేష్ మాత్రం ముందురోజే పార్టీ ఇస్తున్నారంటే ఈ సినిమా విజయం పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు.

మహేష్ మాత్రమే కాదు.. దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాత అనిల్ సుంకర.. ఇలా అందరూ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకులను తప్పనిసరిగా అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు. సినిమాకు కథ.. మాస్ ఎలిమెంట్స్.. కామెడీ అన్నీ చక్కగా కుదిరాయని అంటున్నారు. మరి ఈ నమ్మకం నిజమౌతుందా లేదా అనేది రేపటికి మనకు క్లారిటీ వస్తుంది.
Please Read Disclaimer