డైరెక్టర్ ఎవరైనా మహేష్ కథ అదేనట!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ఫిలిం ఎవరితో చేస్తున్నారు? ఈ ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం చెప్పడం చాలా కష్టం. వంశీ పైడిపల్లి ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చిన తర్వాత మొదలైన కన్ఫ్యూజన్ ఇప్పటివరకూ కొనసాగుతోంది. ‘F3’ అని ఒకరు అంటారు. మెగాస్టార్ ‘ఆచార్య’ లో అతిథి పాత్ర అని మరొకరు అంటారు. ఇవన్నీ కాదు పరశురామ్ సినిమా ఖరారయిందని ఇంకొకరు అంటారు.

అయితే ఇప్పటివరకూ మహేష్ క్యాంప్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం మహేష్ – పరశురామ్ సినిమా కథ అంటూ ఒక స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. విజయ్ మాల్యా.. నీరవ్ మోడి లాంటి ఆర్థిక నేరస్తుల మోసాలు… వారిని హీరో అడ్డుకోవడం లాంటిదే కథ. మరి పరశురామ్ అలాంటి కథతో నిజంగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడో లేదో కానీ ఈ వేల కోట్ల స్కాముల స్టోరీ లైన్ మహేష్ సతీమణి నమ్రతకు నచ్చిందట. ఈ పాయింట్ తో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని.. మహేష్ బాబుకు ఈకథ సెట్ అవుతుందని ఆమె భావిస్తున్నారట.

అందుకే మహేష్ బాబు తన తదుపరి చిత్రం ఎవరితో చేసినా ఈ స్కాములే మూలకథగా ఉండాలని ఆమె చెప్తున్నారట. మరి విజయ్ మాల్యా లాంటి ఆర్ధిక నేరస్తుల్లు.. ఆర్థిక నేరాల చుటూ తిరిగే స్క్రిప్ట్ ను ఎవరు రెడీ చేస్తారో.. ఆ కథతో మహేష్ టీమ్ ను ఎవరు మెప్పిస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-