సరిలేరు నీకెవ్వరు.. ప్రత్యేకంగా మార్చిన మహేష్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ నెమ్మదిగా ప్రారంభం అవుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ ను విడుదల చేస్తామని అనిల్ రావిపూడి టీమ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ టీజర్ ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ టీజర్ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని.. మహేష్ బాబు హీరోయిజం స్టైల్ ను ఎలివేట్ చేసే సీన్స్ ఈ టీజర్లో పొందుపరిచారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్ పై కాస్త నిరాశగా ఉన్న అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చేదిగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ టీజర్ లో మరో ప్రత్యేకమైన అంశం ఉందట. టీజర్ కోసం మహేష్ బాబు స్పెషల్ గా డబ్బింగ్ చెప్పారట. తన కథను టీజర్ లో మహేష్ స్వయంగా వివరిస్తే అంతకంటే ఆసక్తికరమైన అంశం ఏముంటుంది చెప్పండి? మహేష్ స్పెషల్ గా వాయిస్ అందించారని తెలియడంతో టీజర్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Please Read Disclaimer