హీరోగా టీడీపీ ఎంపీ కుమారుడు

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అయిన గల్లా అశోక్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే ఆయన వెండితెరపై కనిపించబోతున్నారు. . ‘భలే మంచి రోజు’ ‘శమంతక మణి’ ‘దేవదాస్’ చిత్రాలతో ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. కమర్షియల్ విజయాలను దక్కించుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా గల్లా అశోక్ సినీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. అమర్రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. తనదైన స్టైల్లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నరేశ్ సత్య అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి కల్యాన్ శంకర్ ఏఆర్ ఠాగూర్ మాటలు రాస్తున్నారు. బీఏ రాజు వంశీ శేఖర్ పీఆర్వోలుగా పనిచేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చంద్రశేఖర్ రావిపాటి వ్యవహరిస్తున్నారు.




Please Read Disclaimer