ప్రభాస్ సినిమా… నిర్మాతలు చెప్పాల్సిందే

0

ఒక స్టార్ హీరో సినిమా మొదలైనప్పటి నుండే ఫ్యాన్స్ హంగామా మొదలవుతుంది. అయితే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ డేట్ తెలియకపోతే తెలిసే వరకూ నిద్ర పోరు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి అలాగే ఉంది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత ‘సాహో’ తో తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచాడు. బాలీవుడ్ స్టైల్ లో కంటెంట్ లేకుండా తీయడంతో సినిమా డమాల్ అనిపించుకుంది.

ఇక ‘బాహుబలి’ తర్వాత ఏడాది పైనే టైం తీసుకొని థియేటర్స్ లోకి వచ్చిన ప్రభాస్ ఇకపై జెట్ స్పీడ్ లో సినిమా చేస్తాడనుకుంటే మళ్ళీ నత్త నడకనే సినిమా చేస్తున్నాడు. సాహో షూటింగ్ జరుగుతుండగానే రాదా కృష్ణతో సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు ప్రభాస్. కానీ ఇప్పటి వరకూ కేవలం ఓ మూడు షెడ్యుల్స్ మాత్రమే జరిగాయి. మేకింగ్ లో మరీ ఆలస్యం అవుతుంది. అయితే నిజానికి ఈ సినిమా ఈ ఏడాదే వచేస్తుందని ఆశించిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇటివలే తన జన్మదినం సందర్భంగా ప్రభాస్ నెక్స్ట్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ అంటూ ప్రకటించాడు క్కృష్ణం రాజు. దీంతో జాన్(వర్కింగ్ టైటిల్) ఈ ఏడాది రాదనేది స్పష్టం అయింది.

అయినా కూడా ఇంకా డేట్ విషయంలో డైలమాలో ఉన్నారు ఫ్యాన్స్. మరో వైపు ఏడాది చివర్లో అయినా ప్రభాస్ సినిమా వస్తుందనే ఆశతో ఉన్నారు. మరి కృష్ణం రాజు ఎందుకిలా రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సంగతి చెప్పి ఉంటారు..? అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఏదేమైనా మరోసారి నిర్మాతల నుండి రిలీజ్ పై క్లారిటీ వస్తే కానీ ఫ్యాన్స్ లో ఉన్న కన్ఫ్యూజన్ పోయేలా లేదు.
Please Read Disclaimer