అల.. ఆల్ హ్యాపీస్.. ఫుల్ నవ్వుల్స్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘అల వైకుంఠపురములో’. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రోమోస్.. పాటలు ఈ సినిమాపై హైప్ ను పీక్స్ లోకి తీసుకెళ్లాయి. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ‘అల వైకుంఠపురములో’ టీమ్ మేకింగ్ వీడియో ను విడుదల చేసింది. రెండు నిముషాల పదిహేడు సెకన్లు నిడివి ఉన్న ఈ మేకింగ్ వీడియోలో షూటింగ్ సమయంలో కెమెరా లో బంధించిన ఎన్నో అందమైన క్షణాలు ఉన్నాయి. వీడియో ప్రారంభంలో గురూజీ పెన్ను చేత బట్టి పేపర్ పై తూటాల్లాంటి మాటలు రాస్తూ ఉంటారు. ఇక ‘వైకుంఠపురం’ అనే పేరు న్న బంగళాను చూపిస్తారు. నిర్మాతలు చినబాబు.. అరవింద్ గార్లతో చర్చలు జరుపుతున్న త్రివిక్రమ్.. సెట్ల నిర్మాణం చూపించారు. కారవాన్ నుంచి కూల్ గా దిగుతున్న స్టైలిష్ స్టార్.. షూటింగ్ లొకేషన్ లో సీనియర్ నటులను పలకరించడం.. లాంటివి కూడా ఉన్నాయి. ఇక ఒక ఫ్రేమ్ లో అయితే టీచర్ లాగా త్రివిక్రమ్.. స్టూడెంట్ లాగా బన్నీ డైలాగ్స్ ను చదువుతూ ఉన్నాయి.

షూటింగ్ సమయం లో నటీనటులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారనేది.. వారి నవ్వులు చూస్తేనే తెలిసి పోతుంది. కొన్ని చోట్ల బన్నీ.. త్రివిక్రమ్..అందరూ పగలబడి నవ్వుతుంటారు. వెంకీ షూటింగ్ లొకేషన్ కు వచ్చిన విజువల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఫైనల్ టచ్ అన్నట్టుగా అల్లు అయాన్ ‘నేను ప్రొడ్యూసర్ అవుతా’ అంటూ స్టైలిష్ స్టార్ ను నవ్వుల్లో ముంచెత్తాడు. ఆలస్యం కైకో మేకింగ్ వీడియో దేఖో!
Please Read Disclaimer