లేటు వయసు ఘాటు అందం

0

బాలీవుడ్ లో లేటు వయసు ఘాటు భామలకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే.. మలైకా అరోరా పేరే చెప్పుకోవాలి. సహజంగా 47 వయసు లో చాలామంది సకల రకాల రోగాలతో రొష్టులతో మానసిక వేదనలతో బాధపడుతూ ఆ దరిద్రాన్ని కుటుంబ సభ్యులకు స్నేహితులకు.. సమాజానికి వీలైనంతగా పంచుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం ప్రపంచాన్ని ఉద్ధరించామనే భ్రమలో ఉంటారు. కానీ మలైకా అలాంటి వారికి పూర్తిగా వ్యతిరేకం.

ఫిట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉంటూ ఇరవైల భామలకు అసూయ కలిగించే గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇరవైల భామల తరహాలోనే సోషల్ మీడియా యాప్స్ వాడుతూ వాటికి గ్లామర్ వైరస్ ను అంటిస్తుంది. దాంతో నెటిజన్లు కిందామీదా పడి-పోతారు! మలైకా స్వయంగా పోస్ట్ చేసే ఫోటోలతో పాటుగా ముంబైలో కొందరు ఫోటోగ్రాఫర్లు వ్యాయామశాలల బైట.. విమానాశ్రయం బయట.. మూడు నక్షత్రాల.. ఐదు నక్షత్రాల హోటల్స్ బయట కాచుకుని కూర్చుని మరీ ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి.

అసలే మలైకా ఫిట్నెస్ ఫ్రీక్. తిండి లేకుండా.. అర్జున్ కపూర్ కలవకుండా రోజు గడుస్తుందేమో కానీ జిమ్ముకు పోకుండా ఒక్క రోజు కూడా గడపదు. తాజాగా ఈ లేటు వయసు సుందరి ముంబైలో ని బాంద్రా ఏరియాలో దివ్య యోగా సెంటర్ బయట కనిపించింది. ఒంటి రంగులో కలిసిపోయే గోధుమ రంగు టాప్.. అదే రంగు ప్యాంట్ ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చింది. చేతిలో సిప్పర్ బాటిల్.. ఫోన్.. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్ తో స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ లా కనిపించింది. కొప్పు కట్టి.. కూలింగ్ గ్లాసెస్ తో ఓ హాలీవుడ్ నటీమణి తరహా లో మలైకా జనాలను చిత్తు చేసింది. మలైకా లాంటి వారు ఇంకా భూమీ మీద ఉన్నారు కాబట్టి గ్లామర్ అనే పదం ఇంకా ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-