ముద్దు ఫోటోతో తమ రిలేషన్ గురించి చెప్పేసింది

0

ప్రేమలు.. అవి కాస్తా పెళ్లిళ్లుగా మారటం లాంటివి బాలీవుడ్ కు కొత్తేం కాదు. టాలీవుడ్ తో పోలిస్తే.. బాలీవుడ్ లో ఎఫైర్లు.. డేటింగ్ లు.. విడిపోవటాలు అన్ని ఎక్కువే. ఎప్పుడు ఎవరితో జత కడతారో.. ఎవరితో కటీఫ్ చెబుతారో? చెప్పటం కాస్త కష్టమే. ఊహకు అందని కాంబినేషన్లు కూడా రీల్ లోనే కాదు రియల్ గా కూడా బాలీవుడ్ లో ఎక్కువే. ఒక పేరున్ననటుడు తనకంటే దాదాపు పన్నెండేళ్లు పెద్దదైన నటితో డేటింగ్ చేయటం.. రానున్న రోజుల్లో అది పెళ్లి వరకూ వెళ్లే అవకాశం ఉండటం మామూలు విషయం కాదు.

హాట్ టాపిక్ గా మాత్రమే కాదు.. పలుమార్లు నెటిజన్లు సైతం ట్రోల్ చేసిన జంటగా బాలీవుడ్ నటీనటులు అర్జున్ కపూర్.. మలైకా అరోరా జోడీని చెప్పాలి. దాదాపు పందొమ్మిదేళ్ల వివాహ బంధాన్ని విడాకులతో తీసుకున్న మలైకా ప్రస్తుతం అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని చెప్పాలి. నిజానికి ఆమె వివాహబంధం బ్రేకప్ వరకూ వెళ్లటానికి కారణం అర్జున్ కపూర్ అన్న మాటను కూడా కొందరు చెబుతుంటారు.

ఈ జంటకు సంబంధించిన ఏదో వార్త తరచూ వైరల్ గా మారుతూ ఉంటుంది. న్యూఇయర్ వేళ.. అర్జున్ కపూర్ కు ముద్దిచ్చిన ఫోటోను మలైకా పోస్ట్ చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ ప్రేమాయణం మీద ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇవ్వని ఈ జంట.. తాజాగా ఘాటైన ఫోటోను విడుదల చేయటం ద్వారా.. తమ ప్రేమ రానున్న రోజుల్లో పెళ్లి పీటలకు ఎక్కేస్తుందన్న విషయాన్ని మలైకా చెప్పేసిందని చెప్పాలి.

సీనియర్ నటి మలైకా 1998లో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లాడారు. తర్వాత వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాత మలైకా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంటే.. అర్బాజ్ మాత్రం జార్జియా మోడల్ ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకంటే ఎంతో పెద్దదైన మలైకతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అర్జున్ త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవటం ఖాయమంటున్నారు.
Please Read Disclaimer