50కి చేరువైనా బిగి సడలని మలైకం

0

మలైకా అరోరా (47).. బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ తెలుగు వారికి సుపరిచితమే. ఛయ్య ఛయ్యా గాళ్ గా ఇక్కడా పాపులరైన ఈ భామ గబ్బర్ సింగ్ లో `కెవ్వు కేక..`తో మరోసారి ఐటెమ్ క్వీన్ గా అభిమానుల హృదయాల్లో నిలిచింది. ఇక మలైకా ఏజ్ గురించి ఎఫైర్ గురించి ఇటీవల గూగుల్ షేకయ్యేలా ట్రెండింగ్ న్యూస్ అట్టుడికించింది.

ఇక ఎవరికైనా వయసు పెరుగుతున్న కొద్దీ వన్నె తరుగుతూ వుంటుంది. కానీ మలైకా విషయంలో ఆ మాట అబద్ధం అని తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందాలతో మెస్మరైజ్ చేస్తోంది.

ఫార్టీ ఫోర్ ప్లస్ వయసులో.. 50 ఏజ్ కి కూతవేటు దూరంలో బిగువైన అందాలతో కవ్విస్తూ నెటిజనులతో పాటు తన అభిమానుల్ని హీటెక్కించేస్తోంది. థర్టీప్లస్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ బాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇటీవల మలైకాకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకున్న మలైకా అశ్చర్యపరిచే ఫిట్ నెస్ తో ఆకట్టుకుంటోంది.

నిత్యం వర్కవుట్లు చేస్తూ నెటిజన్స్ని ఆకట్టుకుంటోంది. మలైకా ఏజ్ 47.. యాభైకి చేరువ అవుతున్నా ఫిట్ నెస్ తో వన్నె తరగని అందాలతో సాటి తారలకు సవాల్ విసురుతోంది. మలైకా తాజాగా రీబాక్ కోసమే ఇలా టైట్ డ్రెస్సుల్లో దర్శనమిస్తూ ఇన్ స్టాని హీటెక్కిస్తోందా? అని అభిమాన జనం అవాక్కవుతున్నారు. ఇటీవల రియాలిటీ షోల్లోనూ మలైకా ఇంత హాట్ గా కనిపించడం లేదు. దీంతో ఇన్ స్టా వేదికగా మలైకా హాట్ ఫోటోలు వీడియో ట్రీట్ తో అలరించే అవకాశాన్ని ఏమాత్రం విడవడం లేదు.