దివా యోగ: ఇలా చేస్తే డైరెక్టుగా మోక్షమే

0

తీగ లాంటి దేహశిరులు కావాలంటే ఈజీగా కుదిరే పనా? దానికోసం చాలానే రిస్క్ తీసుకోవాలి. నిరంతరం జిమ్ యోగా ప్రాణాయామం అంటూ బోలెడన్ని చేస్తేనే కొంతవరకైనా రిజల్ట్ ఉంటుంది. ఇక తేలికపాటి అసనాలతో గొప్ప రిజల్ట్ ఉంటుందని యోగా గురువులు చెబుతుంటారు. అయితే అదేదీ జనాలకు తలకెక్కదు. కానీ సన్నజాజి సోయగం మలైకా చెబితే చాలు.. ఫ్యాన్స్ కి వెంటనే ఎక్కేస్తుంది.

46 ఏళ్ల మలైకా యోగా ఎక్స్ పర్ట్ అన్న సంగతి తెలిసిందే. ఒక టీనేజర్ కి మమ్మీ అయినా ఇప్పటికీ టీనేజీ అందాలతో కుర్రకారులో అగ్గి రాజేస్తున్న మలైకా తీగ లాంటి దేహశిరుల్ని ఎలా మెయింటెయిన్ చేయగలుగుతుంది? అంటే ఇదిగో ఈ శ్రమకు డెడికేషన్ కి ఫలితం అది.

అయితే ఇన్నాళ్లు తనకు తెలిసిన విద్యను బయటి ప్రపంచానికి చూపించింది తక్కువే. అందుకే ఇప్పుడు ఏకంగా సామాజిక మాధ్యమాల్లో యోగా కాంటెస్టులతో అభిమానులకు నేర్పించేందుకు ముందుకొచ్చింది. తాజాగా మండే మోటివేషన్ పేరుతో మలైకా యోగ ముద్రలో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ అసనం పేరు – పించ మయూరం. తలకిందులుగా నేలపై మోచేతులపైనే శరీరాన్ని గాల్లోకి లేపాలి. మోచేతులపై మాత్రమే బరువు అంతా బ్యాలెన్స్ చేయగలగాలి. దీనికి ఆరంభం గోడ సహాయం తీసుకోవచ్చు ఎవరైనా. ప్రయత్నించండి అంటూ టిప్స్ ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. @ది దివా యోగా అండ్ మీ పేరుతో కాంటెస్ట్ ను పరిచయం చేసింది మలైకా. తనలానే చేసి ఆ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయమని కోరింది. మొత్తానికి జనాల్లో యోగాకు అవేర్ నెస్ పెంచాలన్న మలైకా ఆలోచన సరైనదేనని అర్థమవుతోంది.
Please Read Disclaimer