ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ కు ప్రేక్షకులు ఫిదా

0

బాలీవుడ్ స్టార్ హీరో ఆధిత్య రాయ్ విభిన్న చిత్రాలు చేస్తూ ఎప్పటికప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందుతూ ఉన్నాడు. ఆధిత్య రాయ్ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అషికి 2. ఆ చిత్రంలో ఆధిత్య రాయ్ నటన మరియు బాడీకి ప్రేక్షకులు పడిపోయారు. ఆ చిత్రం తర్వాత వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్న ఆధిత్య రాయ్ మళ్లీ ‘అషికి 2’ డైరెక్టర్ మోహిత్ సూరితో రెండవ సారి చిత్రాన్ని చేస్తున్నాడు. ఆధిత్య రాయ్ మరియు మోహిత్ ల కాంబో మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

‘మలాంగ్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో ఆధిత్య రాయ్ సిక్స్ ప్యాక్ బాడీ చూసి బాబోయ్ అంటూ అంతా నోరు వెళ్లబెడుతున్నారు. ఆధిత్యరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలా ఎగ్రసివ్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆధిత్య ప్రేమ స్వచ్చమైనది అలాగే ద్వేషం కూడా అంటూ కామెంట్ జత చేశాడు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూస్తుంటే మరోసారి ఆధిత్య రాయ్ ఒక మంచి సినిమాను ప్రేక్షకులు ఇవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో ఎంతో మంది సిక్స్ ప్యాక్ బాడీని చేశారు. కాని ఆధిత్య రాయ్ సిక్స్ ప్యాక్ బాడీ కుర్రకారును తెగ ఆకట్టుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మలాంగ్ చిత్రం ట్రైలర్ ను ఈనెల 6న విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాను ఫిబ్రవరి 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Please Read Disclaimer