నిమిషం నిడివి ముద్దు సీన్ ఫస్ట్ టేక్ కే పూర్తి

0

సినిమాలో ఎన్ని ఎఫెక్టులు ఉన్నప్పటికి ముద్దు సీన్లకు ఉండే ఇమేజ్ లెక్క వేరే ఉంటుంది. ఏదైనా సినిమాలో హీరో..హీరోయిన్ల మధ్య స్క్రిప్ట్ డిమాండ్ చేసి గాఢ అధర చుంబనాలు ఉంటే వాటికి గురించి జరిగే చర్చ అంతా ఇంతా కాదు. స్క్రీన్ మీద మహా అయితే పది.. పదిహేను సెకన్ల నిడివి ఉండే ముద్దు సీన్లకే ఇంత చర్చ జరిగినప్పుడు.. ఏకంగా నిమిషం నిడివి ఉన్న ముద్దు సీన్.. అందులోనూ అండర్ వాటర్ లో అంటే ఆ లెక్కే వేరుగా ఉండక మానదు. ఇంతకీ ఈ సీన్ ఏ సినిమాలో అంటారా? తాజాగా విడుదలై.. ట్రైలర్ తో అదరగొట్టేసిన బాలీవుడ్ మూవీ మలంగ్ లో అదిరే కిస్ సీన్ ఉన్నట్లు చెబుతున్నారు.

ట్రైలర్ లో హీరో ఆదిత్య.. హీరోయిన్ దిశల మధ్య గాఢమైన ప్రేమను చూపించేందుకు వీలుగా వేడి పుట్టించే ముద్దు సీన్ ను కాస్తంత ట్రైలర్ లో చూపించేయటంతో దీనిపై చర్చ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఉండే ముద్దు సన్నివేశం సినిమాకు హైలెట్ అంటున్నారు. అండర్ వాటర్ లో షూట్ చేసిన ఈ సీన్ కోసం హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించారట. అంతసేపు అండర్ వాటర్ లో నటించేందుకు వారి లంగ్ కెపాసిటీని పెంచేందుకు ఈ ట్రైనింగ్ సాయం చేసినట్లు చెబుతున్నారు. మరింత కసరత్తు తర్వాత షూట్ చేసిన ఈ కిస్ సీన్.. ఆశ్చర్యకరంగా మొదటి టేక్ కే ఓకే అయిపోయిందట. సిల్వర్ స్క్రీన్ మీద ఈ నిమిషపు ముద్దు ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి ఇప్పుడు వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer