మళంగ్: ట్రైలర్

0

ఆషిఖి 2 కాంబినేషన్ నుంచి ఓ సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ ఎలా ఉంటుందో ఊహించగలం. కొంత గ్యాప్ తర్వాత ఆదిత్యరాయ్ కపూర్- మోహిత్ సూరి జోడీ అదిరిపోయే కాన్సెప్టుతోనే ప్రేక్షకాభిమానుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆదిత్యరాయ్ కపూర్- దిశా పటానీ జంటగా మోహిత్ రూపొందించిన సినిమా మళంగ్. అనిల్ కపూర్- కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రాయ్ కపూర్ పోస్టర్లు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా ఆదిత్య రాయ్ కపూర్ 6ప్యాక్ లుక్ తో అదరగొడుతున్నాడు. తాజా భారీ యాక్షన్ థ్రిల్లర్ కు తగ్గట్టు అతడు రూపాన్ని మార్చుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించింది. ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్. హంతకుల చుట్టూ తిరిగే కథాంశం ఇదని ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. సీరియల్ కిల్లర్గా ఆదిత్య రాయ్ కపూర్ పాత్ర ఎంతో ప్రయోగాత్మకంగా కనిపిస్తోంది. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపిస్తున్నారు. ఇక ఇందులో ఖునాల్ కేము పాత్ర ఆసక్తికరం.

అలాగే ట్రైలర్ ఆద్యంతం వాటర్ స్పోర్ట్ .. స్కై డైవింగ్ వంటి సాహసాలు.. ఆదిత్య- దిశ మధ్య మోతాదుకు మించిన రొమాంటిక్ సీన్లు ట్రైలర్ లో రక్తి కట్టించాయి. బికినీ సీన్ తో ట్రైలర్ లో ఎంట్రీ ఇచ్చిన దిశ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ని ఇస్తోంది. చంపడాన్ని ఎంజాయ్ చేస్తాం అంటూ ట్రైలర్ ముగింపు థ్రిల్ పెంచుతోంది. ఆదిత్య భూజాల మీద కూర్చుని.. అతడితో దిశ లిప్ లాక్ చేస్తున్న ఈ సినిమా స్టిల్ ఇప్పటికే దూసుకెళ్లింది. ఇక ట్రైలర్ లో రాయ్ కపూర్ షర్ట్ లెస్ ఫోజులు మగువల్లో గుబులు పెంచడం ఖాయం. ఇంటెన్స్ లవ్- ఎమోషనల్- క్రైమ్ డ్రామా రక్తి కట్టించనున్నాయని అర్థమవుతోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.
Please Read Disclaimer