ర్యాంప్ ను రఫ్ఫాడించింది!

0

మలయాళం భామ మాళవిక మోహనన్ పేరు తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువమందికి తెలిసి ఉండదు. ఎందుకంటే మాళవిక ఇంతవరకూ తెలుగు సినిమాల్లో నటించలేదు. విజయ్ దేవరకొండ ‘హీరో’ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ భామ మలయాళం.. కన్నడ.. తమిళ భాషల్లో నటించింది. రజనీకాంత్ సినిమా ‘పేట’ లో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఈ భామను వర్ణించాలంటే హాటు అనే పదం చాలా చిన్నది. ఏ కీట్సో.. మిల్టనో వచ్చి హాట్ కు మరో కొత్త ఆంగ్ల పదం మనకు అందించి వెళ్లిపోవాలి. అంత హాటు.

రీసెంట్ గా ముంబైలో ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో తళుక్కున మెరిసింది. వినీత్ రాహుల్ డిజైన్ చేసిన ఒక సెక్సీ అవుట్ ఫిట్ లో చూపరులను బౌల్డ్ అవుట్ చేసింది. భారీ వీ నెక్ ఉండే డ్రెస్ లో వయ్యారంగా నడిచి ర్యాంప్ వాక్ చేసిన పరిసరాలను వేడెక్కించింది. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో మంది హాటు భామలు ఉన్నప్పటికీ ఈ ఫోటోలతో ఒక్కసారిగా నెటిజన్ల అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ కార్యక్రమంలో ర్యాంప్ వాక్ చేసిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఒక్కసారి ఈ భామ ఫోటోలు చూసిన తర్వాత గజినీ లాంటి వాడు తప్ప ఎవరూ మరిచిపోలేరు. అసలే ఈ భామ రౌడీ హీరోతో రొమాన్స్ చేస్తోంది. ఆయనేమో టాలీవుడ్ ఇమ్రాన్ హాష్మి.. అటు రౌడీ.. ఇటు హాటీ లిప్పులాకులతో థియేటర్ల టాప్ లేచిపోతుందేమో!
Please Read Disclaimer