స్టెల్లా మోడల్ మడోన్న పిక్చర్..మాళవిక

0

సోషల్ మీడియాలో నిరంతరం మాళవిక మోహనన్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోషూట్లతో చెలరేగుతున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. గ్లామరస్ ఫోటోషూట్ల షేర్ చేయడం ద్వారా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా మాళవిక షేర్ చేసిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

ఇక మాళవిక కెరీర్ సంగతి చూస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేటలో చివరిసారిగా తమిళంలో కనిపించిన మాలవికా మోహనన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న `మాస్టర్` విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ మూవీలో విజయ్ సరసన ఈ బ్యూటీ జత కట్టింది. మాలవికా ఈ చిత్రంలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుంది.

ఇటీవల మాలవిక మోహనన్ షూటింగ్ తో పాటు వెకేషన్ కోసం గోవాకు వెళ్లారు. తాజా ఇన్ స్టా పోస్ట్ లో అందుకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసారు. బీచ్ లో క్లిక్ చేసిన అద్భుతమైన ఫోటోల్ని మాళవిక పంచుకున్నారు. అందాల బుట్ట బొమ్మలా హార్ట్ ఫుల్ గా నవ్వేస్తూ స్పైసీ లుక్ తో వేడెక్కిస్తోంది. స్టెల్లా మోడల్ మడోన్నా రేంజులో చెలరేగుతోందిగా అంటూ యూత్ ఒకటే ఫిదా అయిపోతున్నారు ఈ ఫోటోలు చూశాక.