‘గ్లామర్ షో’లో మాస్టర్ అనిపించుకుంటున్న మలయాళీ భామ!!

0

ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్.. జూనియర్ హీరోయిన్ అనే తేడా లేకుండా అందరు భామలు అందాల ఆరబోతకు సై అంటూనే ఉన్నారు. టాలీవుడ్ బాలీవుడ్ అనే భాషాబేధం చూపకుండా అన్నీ ఇండస్ట్రీలను వీరి అందాలతో ఊపేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రెండులోనే అడుగుపెట్టింది మలయాళీ భామ మాళవిక మోహనన్. ఈ భామ సోషల్ మీడియా మొత్తం తన అందాలతో షేక్ చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన మాళవిక ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ సినిమాలో కూడా మెరిసింది. కానీ ఆ సినిమాతో మాళవికకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో చీరకట్టుతో మెప్పించిన మాళవిక ఇప్పుడు కళ్లు చెదిరే రీతిలో అందాలు ఆరబోస్తుంటే.. అమ్మడిని చూసి షాకైపోతున్నారు అభిమానులు.

ఇక సోషల్ మీడియాలో అందమైన నవ్వుతో కుర్రకారు మనసు దోచుకుంటుంది. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో ఛాన్సులు రానప్పటికీ మాస్టర్ తర్వాత ఖచ్చితంగా వస్తాయని గంపెడు ఆశలతో ఉంది. ఈ లోపు సోషల్ మీడియాలో ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ భామ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్టైలిష్ కాస్ట్యూమ్స్ ధరించి ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలో మత్తెక్కించే చూపులతో అందరి చూపులను అమ్మడి ఎద సొంపులపై పడేలా చూసుకుంటుంది. బ్లాక్ టాప్ ప్లాజా ప్యాంటులో తెగ ఆకట్టుకుంటుంది మాళవిక. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి మాళవిక తెలుగులో కూడా రావాల్సి ఉంది.. అదికూడా విజయ్ దేవరకొండతో అని మురిసిపోయింది. కానీ ఆ సినిమా ప్రస్తుతం పక్కన పడింది. ఇక మాస్టర్ సినిమాతో అమ్మడు రచ్చ చేసేలా ఉంది. చూడాలి మరి ఎం చేయనుందో..!!