బ్లాక్ లో టాప్ లేపేసిన కేరళ కుట్టి

0

`పేట` సినిమాతో కోలీవుడ్ కి పరిచయమైంది కేరళ కుట్టి మాళవిక మోహనన్. విజయదేవర కొండ సరసన హీరో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావాల్సింది. కానీ ఆ సినిమా ప్రస్తుతం హోల్డ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దేవరకొండ ప్లాన్ మార్చారు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఫైటర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ క్రమంలోనే మాళవిక తెలుగు డెబ్యూ ఆలస్యమవుతోందనే చెప్పాలి. ప్రస్తుతం తమిళం లో దళపతి విజయ్ సరసన ఓ భారీ చిత్రం లోనూ మాళవిక కథానాయిక గా నటిస్తోంది.ఇంకా తెలుగులో డెబ్యూ లేకుండానే ఈ అమ్మడి పేరు ఇక్కడా మార్మోగుతోంది. అయితే సినిమాలతో కంటే ఫ్యాషనిస్టాగా ఈ అమ్మడు హైదరాబాద్ సర్కిల్స్ కి సుపరిచితం. ఫిలింఫేర్ సహా పలు అవార్డు వేడుకల్లో మాళవిక స్టైలింగ్ స్టన్నింగ్ లుక్ హాట్ టాపిక్ గా మారాయి. ఇతర నాయికలతో పోలిస్తే మాళవిక సంథింగ్ హాట్.. బోల్డ్ అన్న టాక్ కూడా వినిపించింది.

సోషల్ మీడియాల్లోనూ మాళవిక యమ స్పీడ్. ఇన్ స్టా మాధ్యమంలో రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ యువతరానికి చేరువైంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో మాళవిక ఇచ్చిన ఫోజు అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. స్టన్నింగ్ బ్లాక్ ఫ్రాకులో టాప్ లేపేసింది ఈ బ్యూటీ. ఇంతగా వయ్యారాల వడ్డనలు చేస్తుంటే అవకాశాలు ఇవ్వకపోతారా.. పరేషాన్ అవ్వకుండా ఉంటారా మరి!!