బారోజ్ మరో బాహుబలి అవుతుందా ?

0

స్టార్ హీరోలు దర్శకత్వం చేయడం కొత్తేమి కాదు కానీ ఇప్పటితరంలో ఎవరూ దాని జోలికి వెళ్లడం లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ కృష్ణలు పోటీ పడి మరీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అంతటి సాహసం ఆ తర్వాత మళ్ళీ ఏ స్టార్ హీరో చేయడం చూడలేదు. కన్నడలో రవి చంద్రన్ తమిళ్ లో ధనుష్ లాంటి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కానీ అధికశాతం స్టార్లు నటనకే పరిమితమై రిస్క్ కు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా క్లిష్టంగా భావించే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.

బారోజ్ పేరుతో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరంబవూర్ దీన్ని మల్లు వుడ్ లో కనివిని ఎరుగని బడ్జెట్ లో నిర్మించబోతున్నారు. దీన్ని స్వయంగా మోహన్ లాలే తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ మీద వెల్లడించడం విశేషం. ఇది వాస్కోడిగామా కనిపెట్టిన సంపదను కాపాడే సంరక్షకుడిగా కథగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. జిజో పున్నూసే కథను అందించిన బారోజ్ లో స్పానిష్ నటీనటులు పాజ్ వెగా – రాఫెల్ అమార్గో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్ మాటలను బట్టి చూస్తే ఇది ఇంచుమించు బాహుబలి రేంజ్ లో ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది.

చిల్డ్రన్ ఫాంటసీ జానర్ లో రూపుదిద్దుకునే ఈ మూవీలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఎన్నో అంశాలు ఉంటాయట. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ లో సినిమాలు తీసే విషయంలో ముందుండే కేరళలో ఇప్పుడు మోహన్ లాల్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నాడన్న వార్త సెన్సేషన్ గా మారింది. బహుశా లూసిఫర్ తో డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన స్టార్ హీరో పృథ్వి రాజ్ ని స్ఫూర్తిగా తీసుకున్నాడు కాబోలు. బారోజ్ నిర్మాణం వచ్చే ఏడాది నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది
Please Read Disclaimer