అక్కడ మిస్టర్ కేకే ను బ్యాన్ చేశారు

0

ఎన్టీఆర్ ను చూశాం.. ఏఎన్నార్ ను చేశాం.. ఎస్వీని చూశాం.. కానీ వాళ్లకు మించిన నటుడివిగా ఉన్నావురా అంటూ జెంటిల్ మెన్ లో ఒక డైలాగ్. విక్రమ్ నటన ఎంత టెరిఫిక్ గా ఉంటుందో చెప్పే చిత్రమది. ఆ మాటకు వస్తే.. సినిమా ఏదైనా.. పాత్రకు తగ్గట్లుగా తనను తాను మార్చుకునే తీరు చియాన్ విక్రం సొంతం. ఆయన తాజాగా నటించిన చిత్రం మిస్టర్ కేకే.

మాతృక తమిళంలో కదరం కొండన్ పేరుతో రిలీజ్ అయిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీకి కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ చూసినంతనే సినిమా మీద అంచనాలు భారీగా వ్యక్తమైనా.. బొమ్మ పడిన మొదటి ఆటకే.. సినిమా మీద నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేసింది.

దీంతో.. ఆ తర్వాత షోలన్నీ ఖాళీ అయిన పరిస్థితి. దీంతో.. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న విక్రమ్ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. మిస్టర్ కేకే టీంకు ఊహించని రీతిలో మరో షాక్ తగిలింది. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం మలేషియాలో జరిగింది.

అయితే.. మలేషియా పోలీసుల్ని తప్పుగా చూపించినందుకు అక్కడి ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను మలేషియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న లోటస్ ఫైవ్ స్టార్ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. అసలు.. ఇబ్బందుల్లో ఉన్న చిత్రానికి తాజాగా పడిన బ్యాన్ వేటు మరింత ఇబ్బందికరంగా మారుతుందనటంలో సందేహం లేదు.
Please Read Disclaimer