న్యూడ్ సీన్లతో ఇప్పుడు అందరూ హ్యాపీ అంటున్న నాటి నటి!

0

ఇప్పుడు రోజులు మారాయి…గతంలో అయితే కిస్ సీన్లు న్యూడ్ సీన్లు కనిపిస్తే జనాలు చాలా నొచ్చుకునే వారు.. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. న్యూడ్ సీన్లలో నటించడానికి హీరోయిన్లూ మొహమాట పడటం లేదు జనాలు కూడా వాటిని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు..’ అని అంటోంది మల్లికా శెరావత్.

పదేళ్ల కిందటి వరకూ ఈ భామను ఎవరికీ పరిచయం చేయనక్కర్లేదు. భారతీయ సినీ తెర పై సంచలనానికి మారు పేరుగా నిలిచింది మల్లిక. ‘మర్డర్’ సినిమాలో హాట్ హాట్ గా చెలరేగిపోయి మల్లిక సంచలనం రేపింది. అప్పట్లో మల్లిక నటనను చూసి అనేక మంది బుగ్గలు నొక్కుకున్నారు.

ఆ బికినీ షోలకు లిప్ లాక్ లకు కుర్రకారు మతిపోయింది. ‘మర్డర్’ సినిమా సంచలన విజయం సాధించింది. అదే సమయంలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి కూడా. అనేక మంది సంప్రదాయ వాదులు ఆ తెగింపు పట్ల తీవ్రంగా స్పందించారు. ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.

ఆ తర్వాత మరి కొన్నాళ్లు మల్లిక అలాగే కొనసాగింది. హాలీవుడ్ వరకూ వెళ్లింది. జాకిచాన్ తో కూడా నటించింది. క్రమంగా తెరమరుగు అయ్యింది. అలా బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో హాట్ షోకు ఆద్యురాలు లాంటిది మల్లిక. తను పేరు తెచ్చుకున్న రోజులకూ ఇప్పటికి పరిస్థితుల్లో వచ్చిన తేడాల గురించి మల్లిక స్పందించింది.

తను హాట్ గా రెచ్చిపోయిన రీతినే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు రెచ్చిపోతూ ఉన్నారని అయితే వారెవరి మీదా ఇప్పుడు విమర్శలు లేవని మల్లిక గుర్తు చేస్తోంది. తనను అప్పట్లో అనవసరంగా నిదించారనే శ్లేష కూడా వినిపిస్తోంది మల్లిక మాటల్లో!
Please Read Disclaimer