ఆ కారణంగా 30 సినిమాలు పోగొట్టుకుందట

0

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన హాట్ బ్యూటీ మల్లికా శెరావత్. ఈ అమ్మడు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే ఈమద్య కాలంలో మాత్రం ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. స్టార్ డం దక్కించుకున్నా కూడా తన దుడుకు స్వభావం కారణంగా చాలా సినిమాలను పోగొట్టుకోవాల్సి వచ్చిందని మల్లికా శెరావత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన 15 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి అయిన సందర్బంగా మల్లికా శెరావత్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో మల్లికా పలు సంచలన విషయాలను వెళ్లడించింది. నా స్వభావం రీత్యా నేను కాస్త ఎక్కువగా మాట్లాడేస్తాను. దాంతో చాలా మంది హీరోలు నన్ను వారి సినిమాల నుండి తీసేసిన సందర్బాలు ఉన్నాయి. నన్ను తొలగించి వారి ప్రియురాళ్లను సినిమాల్లో హీరోయిన్స్ గా పెట్టుకున్నారు. అలా నేను 30 సినిమా ఆఫర్ల వరకు పోగొట్టుకున్నాను. నాకు ఎవరైనా అవకాశం ఇచ్చినా కూడా కొందరు హీరోలు ఆమె ఎక్కువ మాట్లాడేస్తుంది.. ఆమెతో సినిమా చేయడం మంచిది కాదంటూ దర్శకులకు చెప్పిన సందర్బాలు కూడా ఉన్నాయి.

ఒకప్పుడు నన్ను వద్దనుకున్న హీరోల గురించి ఇప్పుడు ఆలోచిస్తే నాకు వారు మూర్ఖుల మాదిరిగా కనిపిస్తారు. గతంలో నేను నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడితే నేను దేశం పరువు తీసినట్లుగా విమర్శలు చేశారు. నాకు దేశ భక్తి లేదన్నట్లుగా కొందరు నన్ను తిట్టారు. నాకు దేశం పట్ట గౌరవం ప్రేమ ఉందనే విషయాన్ని నేను వారికి నిరూపించాల్సిన అవసరం లేదు అనుకున్నాను. ప్రస్తుతం హీరోయిన్స్ కు ఉన్నంత స్వేచ్చ గతంలో లేదు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ చాలా బాగుంది. ఇది గోల్డెన్ టైం అంటూ మల్లికా శరావత్ పేర్కొంది.
Please Read Disclaimer