‘మర్డర్’ బ్యూటీ బోల్డ్ లుక్

0

‘మర్డర్’ చిత్రంతో బాలీవుడ్ లో సెన్షేషనల్ హాట్ బ్యూటీగా పేరు దక్కించుకున్న మల్లికా షెరావత్ దాదాపు రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉంది. హీరోయిన్ గా స్టార్ డం దక్కించుకోక పోయినా కూడా ఐటెం సాంగ్స్ మరియు అందాల ప్రదర్శణతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోతూనే వస్తుంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేసిన ఈ అమ్మడు తాజాగా హాలీవుడ్ మూవీ ‘టైమ్ రైడర్స్’ అనే చిత్రంలో నటించింది.

ఆ చిత్రంలోని తన లుక్ ను తాజాగా సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది ఈ అమ్మడు. వారియర్ ప్రిన్సెస్ పాత్రలో కనిపించబోతున్న ఈ అమ్మడు అందుకు సంబంధించిన లుక్ ను షేర్ చేసింది. తన గత చిత్రాల్లోని పాత్రలతో పోల్చితే ఈ చిత్రంలోని పాత్రలో మల్లికా షెరావత్ స్టన్నింగ్ గా ఉందంటూ టాక్ వినిపిస్తుంది. ఈ అమ్మడు ఈసారి హాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రంతో హాలీవుడ్ లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న మల్లికా షెరావత్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. తనకు బాలీవుడ్ లో ఎక్కువగా ఆఫర్లు రాకపోవడంకు ప్రధాన కారణం నేను హీరోలు మరియు దర్శక నిర్మాతలతో డేటింగ్ చేసేందుకు ఒప్పుకోక పోవడం అని.. తాను అతిగా మాట్లాడే స్వభావం కలిగి ఉండటం వల్ల కూడా తనకు వచ్చిన ఆఫర్లు కూడా పోయాయి అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer