బిల్ గేట్స్ తో ఆ విషయం మాట్లాడటం సంతోషం : మల్లికా శెరావత్

0

బాలీవుడ్ ఐటెం బాంబ్ మల్లికా శెరావత్ మెల్లగా వెండి తెరకు దూరం అయ్యింది. అప్పుడప్పుడు బుల్లి తెరపై ఈ అమ్మడు సందడి చేస్తూ కనిపిస్తుంది. ఇటీవలే సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో ఎంటర్ టైన్ చేసింది. వెండి తెర నుండి ఈమెకు ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నా కూడా ఏవో కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె వాషింగ్టన్ లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇచ్చిన ఒక పార్టీకి ఈమె హాజరు అయ్యింది.

ఆ పార్టీలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన తారలు మరియు సెలబ్రెటీలు ఇంకా వ్యాపారవేత్తలు హాజరు అయ్యారు. ఆ పార్టీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా పాల్గొన్నాడు. ఆ సందర్బంగా బిల్ గేట్స్ తో మల్లికా శెరావత్ మాట్లాడటం జరిగిందట. ఆయనతో మహిళ సాధికారత గురించి మాట్లాడటం జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బిల్ గేట్స్ తో దిగిన ఫొటో ను షేర్ చేసి దాంతో పాటు బిల్ గేట్స్ తో మహిళ సాధికారత గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అంది. ఆయన తనకు ఇన్సిపిరేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసింది.