మల్లిక హలాసనం!

0

మల్లిక షెరావత్ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన భామే కానీ 2002 నుండి 2010 వరకూ బాలీవుడ్ లో దుమ్ము లేపింది. స్టార్ హీరోయిన్ లీగ్ కు చేరలేకపోయింది కానీ హాట్ ఇమేజ్ తో ప్రేక్షకులను నిద్రకు దూరం చేసింది. మన తెలుగు సినిమాల్లో లిప్పు లాకులు లేని కాలంలోనే లిప్పు లాకులను అవలీలగా లాగిస్తూ సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్న ఇమ్రాస్ హష్మికి ‘మర్డర్’ లో తన వంతు తోడ్పాటు అందించింది ఈ భామే.

ఇప్పుడు సినిమాలలో అవకాశాలు పెద్దగా లేవు కానీ ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం.. కేన్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో తనలోని ఫ్యాషన్ ను బయటకు తీయడం లాంటివి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “నాకు ఎంతో ఇష్టమైన యోగాసనాల్లో హలాసనం ఒకటి. అది మనసును కుదుటపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పూర్తి విశ్రాంతిని ఇస్తుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయింది కదా. హలాసనం.. పేరులోనే హలం ఉంది. హలం అంటే నాగలి. పొలం దున్నే నాగలి తరహాలో బాడీని పెట్టాలి. మల్లిక కొన్నేళ్లుగా యోగా ప్రాక్టీస్ చేస్తోంది కాబట్టి ఇలాంటి ఆసనాలను అవలీలగా చేస్తోంది కానీ అలవాటు లేనివారు చేయడం బహు కష్టం. ఇలాంటి వాటికి ముకేష్ యాడ్… రాహుల్ ద్రావిడ్ రన్ అవుట్ తరహా హెచ్చరికలు ఉంటే బాగుంటుందేమో!

ఈ ఫోటోలో మల్లికా ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక రిసార్టులోని అరుగు మీద ఈ హలాసనం వేసింది. ఇక ఈ ఫోటోకు నెటిజన్ల రెస్పాన్స్ అదిరిపోయింది. “ఖతర్నాక్ ఆసనం మేడమ్”.. “అసలు ఇలా ఎలా చేస్తారు?”.. “ఫిట్నెస్ కు రోల్ మోడల్” అంటూ తమ స్పందనలు తెలిపారు. ఇక మల్లికా సినిమాల విషయానికి వస్తే చేతిలో ఆఫర్లు లేవు కానీ రీసెంట్ గా ఎఎల్టీ బాలాజీ వారి ‘బూ సబ్కో ఫటేగీ’ అనే వెబ్ సీరీస్ లో నటించింది.
Please Read Disclaimer