పులితో అచ్చిక బుచ్చికలాడుతోందే!

0

మాళవిక శర్మ తెలుసు కదా.. ముంబై భామ. మాస్ మహారాజా చిత్రం ‘నేల టికెట్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ. ఆ సినిమా హిట్ కాలేదు కానీ.. అయి ఉంటే మాత్రం ఈ పాటికే భారీ పాపులారిటీ వచ్చి ఉండేది. ఎందుకంటే ఈ భామ హాట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్. ముంబై సర్క్యూట్స్ లో ఒక హాట్ మోడల్. ఈ భామ లా స్టూడెంట్ కానీ తన మోడలింగ్ టాలెంట్ అంతా తన ఫోటోలలో చూపిస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఈ భామ పట్టయాలో చిల్ అవుట్ అవుతూ ఉంది. పట్టయా అనగానే బీచులు.. బికినీలు అనుకుంటాం. కానీ అక్కడ ఉన్న టైగర్ పార్క్ చాలా చాలా ఫేమస్. అక్కడ పులులతో ఫోటోలు తిగుతారు విజిటర్స్. మాళవిక కూడా అలానే ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ ”ఈ పులి పుట్టినప్పటి నుంచి మనుషులతో కలిసి మెలిసి ఉండడాన్ని నేర్పించారు. ఈ టైగర్ పార్క్ లో టైగర్ కబ్స్ చాలా క్యూట్. అల్లరిచేస్తాయి.. ఆడతాయి. అలా అని వాటికి మత్తు ఇవ్వడం లాంటివి చెయ్యరు. అందుకే అవి ఎంతో సంతోషంగా ఆడతాయి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

పులివెనక కూర్చుని.. పులి వెనక పడుకొని వీపుపైన చేతులు వేసి… పులి పొట్టను నిమురుతూ ఈ భామ ఫోటోలు తీసుకుంది. ఈ టైగర్ ట్రెయిన్డ్ అని తెలియని వారికి ఈ ఫోటోలను చూపిస్తే గుండె గుభేల్ అనడం ఖాయం. ఏదేమైనా ఈ ఫోటోలు నెటిజన్లను తెగ మెప్పించాయి. ఫోటోలకు లైకులే లైకులు. పులి గురించి.. పులితో పోజుల గురించి మాట్లాడుకున్నాం కానీ పాప అందాల విందు గురించి మాట్లాడుకోలేదు.. యధావిధిగా అందాలను ఆరబోసింది. బ్లాక్ టీ షర్టు.. డెనిమ్ షార్ట్ ధరించి కళ్ళకు గాగుల్స్ తో యమా స్టైలిష్ గా కనిపించింది. ఫ్రంట్ టాట్టూ లాంటిది ఉంది.. అది కూడా యమా సెక్సీగా ఉంది.
Please Read Disclaimer