`యమదొంగ` చిన్నది సడెన్ సర్ ప్రైజ్

0

మమత మోహన్ దాస్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. గాయనిగా కెరీర్ ప్రారంభించి యమదొంగ చిత్రంతో టాలీవుడ్ లో కథానాయికగా తెరంగేట్రం చేసింది ఈ మలయాళ బ్యూటీ. కేడీ- కింగ్ లాంటి చిత్రాల్లో నాగార్జున సరసన నటించింది. ఓవైపు గాయనిగా.. మరోవైపు కథానాయికగా కెరీర్ ని కొనసాగించింది. అయితే లైఫ్ లో ఊహించని ఓ కుదుపు ఈ అమ్మడి ఆశల్ని అడియాశలు చేసిందనే చెప్పాలి.

కెరీర్ స్పీడ్ అందుకుంటున్న సమయంలో ప్రమాదకర క్యాన్సర్ బారిన పడడం పెద్ద మైనస్ అయ్యింది. క్యాన్సర్ కి చికిత్స అనంతరం కొంతకాలం సినిమాలకు దూరమై మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించినా ఆశించినంత స్పీడ్ గా రేస్ లో దూసుకెళ్లలేకపోయింది. అప్పట్లోనే మీటూ ఉద్యమం నేపథ్యంలో ఓ సంచలన వ్యాఖ్యతో మమతా హాట్ టాపిక్ అయ్యింది. “ అందంగా ఉండి రెచ్చగొట్టేలా ప్రవర్తించడమే మహిళలపై అఘాయిత్యాలు జరగడానికి కారణం!! అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేయడంతో దానిపై సామాజిక మాధ్యమాల్లో వాడి వేడిగా చర్చ సాగింది.

అందంగా ఉన్న అమ్మాయిలు ఈ సొసైటీలో ధైర్యంగా బ్రతకడం కష్టం. లైంగిక వేధింపులకు కారణం అమ్మాయిల ప్రవర్తనే అని అనడంతో అది కాస్తా మహిళామణుల ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత ఏమైందో మమత మళ్లీ మీడియాకి టచ్ లో లేదు. ఇక అందరు కథానాయికల్లానే మమతా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంది. లేటెస్టుగా ఓ ఫోటోషూట్ ని షేర్ చేసింది. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ స్టైల్స్ తో రకరకాల భంగిమల్లో 35ఏజ్ మమత ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం యువతరంలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఓ ఫోటోలో ఆ ఎడమ చేతిపై పచ్చబొట్టు యూత్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రయత్నం చూస్తుంటే మరోసారి టాలీవుడ్ సహా సౌత్ లో అవకాశాల కోసం ట్రయల్స్ లో ఉందనే అర్థమవుతోంది. 35 అంటే చిన్న వయసే ఇంకా. ఏజ్ బార్ కాలేదు. అందుకే ఈసారైనా అదృష్టం తనని వెతుక్కుంటూ వస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer