ఈ మాట చిరంజీవిని అడగగలవా ? అన్నాడట!

0

కొందరు స్టార్ హీరోలు కొన్ని భాషలకే పరిమితమైపోయి ఉంటారు. భాష రాకపోవడం వల్ల రిస్క్ ఎందుకులే అనుకునే హీరోల లిస్టు చాలానే ఉంది. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టీ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అవును తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా ఆయన రిజక్ట్ చేసారు. తెలుగులో అప్పుడెప్పుడో ‘సూర్య పుత్రులు’ ‘స్వాతి కిరణం’ సినిమాలు చేసాడు . తర్వాత మళ్ళీ తెలుగులో ‘యాత్ర’ మాత్రమే చేసాడు.

అయితే ఆ మధ్య పవన్ కళ్యాణ్ సినిమా కోసం అల్లు అరవింద్ మమ్ముట్టి కి ఓ ఆఫర్ ఇచ్చారట. సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది ఏమంటారు అని అడిగాడట. దానికి వెంటనే చిరంజీవిని ఇదే మాట అడగగలరా అని నేరుగా ప్రశ్నించాడట మమ్ముట్టి. లేదండి నేను ఆయనని అడగలేను అన్నాడట అల్లు. మరి నన్నెందుకు అడిగారని అన్నాడట. ఆమాట విని వెంటనే అల్లు అరవింద్ ఫోన్ కట్ చేసేసాడట. ఈ విషయాన్ని తాజాగా మమ్ముట్టి ‘మామంగం’ ప్రెస్ మీట్ లో చెప్పి ఆ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు అల్లు అరవింద్.
Please Read Disclaimer